Monday, December 23, 2024

స్టాక్.. ‘క్రాష్’

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను చవిచూశాయి. ఈ రెండు రోజుల్లో బిఎస్‌ఇ సె న్సెక్స్ 1,647.85 పాయింట్లు నష్టపోగా, ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 10.73 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. శుక్రవారం కూడా సెన్సెక్స్ భారీగా 874 పాయింట్లకు పైగా పతనమైంది, ఆఖరికి 59,330 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 287 పాయిం ట్లు పతనమై 17,575 వద్ద కొనసాగుతోంది. రెండో రోజుల్లో బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.73 లక్షల కోట్లు క్షీణిం చి రూ.269.65 లక్షల కోట్లకు పడిపోయింది. గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్లకు సెల వు ఉంది. శుక్రవారం సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 22 నష్టపోయాయి. అదే సమయంలో కేవలం 8 స్టాక్స్ మాత్రమే ఊ పందుకున్నాయి.

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో అత్యధిక క్షీణత కనిపించింది. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ 20% క్షీణించాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్, ఎస్‌బిఐ, ఐసిఐసి ఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఒఎన్‌జిసి, బిపిసిఎల్ నష్టపోయాయి. మ రోవైపు టాటా మోటార్స్, బజాజ్ ఆ టో, డాక్టర్ రెడ్డీ, ఐటిసి, సిప్లా, దివీస్ ల్యాబ్ పెరిగాయి. ఎన్‌ఎస్‌ఇ 11 రం గాల సూచీలలో పిఎస్‌యు బ్యాంకు రంగం అత్యధికంగా 5.43 శాతం క్షీణించింది. ఇక మెటల్‌లో 4 శాతం, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవే ట్ బ్యాంక్ సెక్టార్‌లో నష్టాలు నమోదయ్యాయి. ఐటి, రియల్టీ, మీడియా రంగాల్లో కూడా క్షీణత కనిపించింది. అదే సమయంలో ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి రంగాల్లో జోరు కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News