Sunday, November 3, 2024

స్వల్పంగా నష్టాల్లో మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

 

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం స్వల్పంగా నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్లలో బలహీన ట్రెండ్ ఉండడంతో పవర్, మెటల్, కన్జూమర్ డ్యూరబుల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో మార్కెట్లు మధ్యాహ్నం నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 151 పాయింట్ల నష్టంతో 61,033 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 45 పాయింట్లు పతనమై 18,157 స్థాయికి చేరుకుంది.

సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 22 షేర్లు నష్టపోగా, 8 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 45 పైసలు బలపడి 81.47 వద్ద ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. కానీ ఆఖరి నష్టపోయింది. రసాయన సంస్థ అయిన ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) బుధవారం నుండి ప్రారంభించబడింది. ఈ ఐపిఒ నవంబర్ 11న ముగుస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News