- Advertisement -
న్యూఢిల్లీ: గృహ హింస చట్టం 2005 మహిళలను రక్షించేందుకు ఉద్దేశించింది. ఇది ఏ మతం వారికైనా, ఏ సామాజిక వర్గానికి చెందిన వారికైనా ఒక్కటేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళలకు వర్తించే ఓ సివిల్ కోడ్ అని పేర్కొంది. న్యాయమూర్తులు బి.వి.నాగరత్న, ఎన్.కోటీశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం రాజ్యాంగపరంగా మహిళలందరికీ రక్షణ కల్పించే చట్టం అని పేర్కొంది.
తనకు భరణం, పరిహారం ఇచ్చే విషయంలో కర్నాటక హై కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ ఓ మహిళ అప్పీల్ చేసుకోగా అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా పేర్కొంది.
- Advertisement -