Monday, December 23, 2024

మోటివేషనల్ స్పీకర్ పై గృహహింస కేసు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వివేక్ బింద్రాపై గృహ హింస కేసు నమోదైంది. తన సోదరిని వివేక్ కొట్టి, ఇంట్లోంచి గెంటేశాడని అతని బావమరిది ఫిర్యాదు చేశాడు. వివేక్ బింద్రాకు యూట్యూబ్ లో రెండు కోట్లమందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. బింద్రా 2023 నవంబర్ 6న యానికా అనే యువతిని వివాహం చేసుకున్నారు. నోయిడా సెక్టార్ 94లోని సూపర్ నోవా అవార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు.

ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వివరాల ప్రకారం డిసెంబర్ 7వ తేదీ రాత్రి వివేక్ బింద్రా తన తల్లి ప్రభతో ఘర్షణ పడ్డాడు. అతని భార్య యానిక జోక్యం కల్పించుకోవడంతో వివేక్ ఆమెపై దాడి చేసి, ఇంట్లోంచి గెంటేశాడు. యానికా సోదరుడు వైభవ్ క్వాట్రా ఆమెను ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి, నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుకు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. వాటిలో ఒక వీడియోలో వివేక్ బింద్రా తన భార్యను రోడ్డుపై గెంటేస్తున్నట్లుగా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News