Thursday, January 23, 2025

భార్య బయటకు రాకుండా గోడ కట్టేసి..

- Advertisement -
- Advertisement -

Domestic violence case against Pullareddy Sweets chief's grandson

పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై గృహ హింస కేసు

మన తెలంగాణ/హైదరాబాద్ : పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడు ఏక్‌నాథ్ రెడ్డిపై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు అతడిపై గృహ హింస కేసు నమోదు చేశారు. ఏక్‌నాథ్ రెడ్డి తనను నిర్భంధించాడని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంట్లోనే ఉంచి గోడ కట్టేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పంజాగుట్టు పోలీసులు ఏక్‌నాథ్‌పై వరకట్న వేధింపులతో పాటు గృహహింస కేసు నమోదు చేశారు. ఇక, గత కొంతకాలంగా ఏక్‌నాథ్ రెడ్డి దంపతుల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. భార్యను ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఏక్‌నాథ్ అడ్డుకున్నాడు. వారుంటున్న భవనంలోని పైఅంతస్తు నుంచి తన భార్య కిందకు రాకుండా బంధించాలని ఏక్‌నాథ్ రెడ్డి తలచాడు. రాత్రికి రాత్రే ఆమె ఉంటున్న గదికి అడ్డుగా గోడను నిర్మించాడని తెలుస్తోంది. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

దీంతో ఏక్‌నాథ్ భార్య డయల్ 100కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. దీంతో స్పందించిన పంజాగుట్ట పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెకు బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, ఏక్ నాథ్ తండ్రి రాఘవరెడ్డి పుల్లా రెడ్డి గ్రూప్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఏక్‌నాథ్ రెడ్డి భార్య తండ్రి మైనింగ్ వ్యాపారం చేస్తుంటారు. 2014లో ఏక్‌నాథ్ వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా గోకవరం గ్రామానికి చెందిన జి. పుల్లారెడ్డి 1948లో కర్నూలులో మిఠాయిల దుకాణాన్ని ప్రారంభించి, అంచలంచెలుగా ఎదిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుల్లారెడ్డి స్వీట్స్ హౌస్ల్‌ను స్థాపించి, వినియోగదారుల నుంచి మంచి పేరును సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఆయన మనవడు ఏక్‌నాథ్ రెడ్డిపై కేసు నమోదు అవడంతో సంచలనంగా మారింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News