Thursday, January 23, 2025

యూట్యూబ్ సెలబ్రిటి వివేక్ బింద్రాపై గృహ హింస కేసు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్ఫూర్తిదాయక వక్త, సామాజిక మాధ్యమ ప్రభావశీలి వివేక్ బింద్రాపై ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గృహ హింస కేసును పోలీసులు నమోదు చేశారు. బింద్రా భార్య సోదరుడు నోయిడా సెక్టార్ 126లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బింద్రా భార్య యానిక సోదరుడు వైభవ్ క్వాత్ర నమోదు చేసిన ఫిర్యాదు ప్రకారం బింద్రా దంపతులు నోయిడాలోని సెక్టార్ 144లో నివసిస్తున్నారు. డిసెంబర్ 7 తెల్లవారుజామున బింద్రాకు, ఆయన తల్లి ప్రభ మధ్య వాగ్వివాదం చెలరేగింది. గొడవను సర్దుబాటు చేయడానికి ప్రయత్నించిన యానికపై బింద్రా చేయిచేసుకున్నారు. ఆ దెబ్బలతో యానిక శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి.

వాటిని ఆమె వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అయింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం డిసెంబర్ 6న బింద్రాకు, యానికకు వివాహమైంది. పెళ్లయిన కొద్ది గంటలకే యానికను గదిలోకి తీసుకెళ్లిన బింద్రా ఆమెను దుర్భాషలాడుతూ జుట్టు పట్టుకుని కొట్టాడు. ఈ దాడి కారణంగా యానిక చెవులు పనిచేయడం మానేశాయి. ఆమె మొబైల్ ఫోన్‌ను కూడా బింద్రా పగలకొట్టాడు. బడా బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సిఇఓగా ఉన్న బింద్రాకు యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News