హైదరాబాద్: స్వచ్ఛమైన నేతి మిఠాయిలకు పేరు పొందిన పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని పుల్లారెడ్డి మనవడు ఏక్నాథ్రెడ్డిపై గృహహింస కేసు నమోదైంది. ఏకనాథ్ భార్య ప్రజ్ఞా రెడ్డిని అతడి కుటుంబ సభ్యులు, భర్త మానసికంగా, శారీరకంగా వేధించడంతో వారికి వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోడలు ప్రజ్ఞా రెడ్డిని ఇంట్లోకి రానివ్వాలని, ఆమెకు రక్షణ కల్పించాలని పంజాగుట్ట పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం కోడలిని వేధింపులకు గురి చేశారు. కోడలిపై ఆగ్రహంతో ఆమె గది నుంచి బయటకు వచ్చే దారిని మూసేస్తూ రాత్రికి రాత్రే గోడ కట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే పుల్లారెడ్డి కుటుంబ సభ్యుల మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ప్రజ్ఞా రెడ్డి కోర్టును ఆశ్రయించింది. 4వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు కేసు విచారించింది. బాధితురాలిని ఇంట్లోకి రానివ్వాల్సిందే అని శుక్రవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పుల్లారెడ్డి మనవడిపై గృహహింస కేసు…
- Advertisement -
- Advertisement -
- Advertisement -