Sunday, December 22, 2024

ప్రధాని మోడీకి  డొమినికా దేశపు అత్యున్నత పురస్కారం

- Advertisement -
- Advertisement -

రోసో: కరేబియన్ దేశమైన డొమినికా దేశం గురువారం ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘కామన్వెల్త్ ఆఫ్ డొమినికా’  అనే పురస్కారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి కాలంలో భారత్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించారు.

2021 ఫిబ్రవరి నెలలో దాదాపు 70,000 డోసుల ‘ఆస్ట్రాజెన్కా కొవిడ్-19 వ్యాక్సిన్ ను ఇండియా, డొమినాకా దేశానికి పంపింది. ప్రధాని మోడీకి ప్రకటించిన ఈ అవార్డును డిమినికా అధ్యక్షుడు సిల్వానీ బర్టన్ ఇండియా-కారికోమ్ సమాశంలో ప్రదానం చేస్తారు. అది గయానాలోని జార్జ్ టౌన్ లో నవంబర్ 19 నుంచి జరుగనుంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News