వాషింగ్టన్ : ఏది ఏమైనా 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగేందుకు డోనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. అభిశంసనలు, క్యాపిటల్ హిల్స్ ఘటనలో ట్రంప్ దోషి అని నిర్థారణలతో సొంత రిపబ్లికన్ పార్టీ ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తుం దా? అనేది ప్రశ్నగా మారింది. అయితే రిపబ్లికన్ పార్టీ నుంచి అభ్యర్థిత్వానికి సమ్మతి లేకపోతే ఆయ న మూడో పార్టీ నుంచి బరిలోకి వస్తారని, ఈ మేరకు పలు సంకేతాలు వెలువరించారని అమెరికా పత్రికలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ఎన్నికల్లో ప్ర ధాన పార్టీలైన డెమోక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ తరఫు అభ్యర్థులు ఎవరనేది అత్యంత కీలకం అయింది. తాను థర్డ్ పార్టీ అభ్యర్థిగా నిలుస్తానని ట్రంప్ ఇటీవ లే ఓ పత్రికకు తెలిపారు. అయితే ఈ థర్డ్‌పార్టీ ఏమిటనేది ట్రంప్ స్పష్టం చేయలేదు. అయితే ట్రంప్ ఇటీవలే ఏర్పాటు అయిన ఫార్వర్డ్ పార్టీ నుంచి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సూచనప్రాయంగా వెల్లడైంది. అయితే ఈ విషయం నిర్థారణ కాలేదు.
ఇప్పటికే పలువురు రిపబ్లికన్లు త మ పార్టీ తరఫున ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ అయితేనే బాగుంటుందని మ ద్దతు ఇస్తున్నారు.దీనితో రాన్‌కు బరిలోకి దిగేందు కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కన్సర్వేటివ్ రిపబ్లికన్లలో ఎక్కువ మంది ట్రంప్ పట్ల మొగ్గుచూపుతున్నారు. 2020 దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని హైజా క్ చేసేందుకు ట్రంప్ భారీ స్థాయి లో యత్నించారని, ఇది చివరకు విద్రోహ చర్య అ యిందని అటు డెమోక్రాట్లు నిరూపించారు. అంతేకాకుండా సొంత డెమోక్రాటిక్ పార్టీలోని రాన్ డెసాంటిస్ కూడా అత్యధికంగా తన అభ్యర్థులను గెలిపించుకుని పార్టీ లో ట్రంప్ ఆధిపత్యం చెల్లకుం డా చేశారు. దీనితో ట్రంప్ ఇప్పుడు మూడోపార్టీ కోసం వెతుకులాటలో ఉన్నారు. పార్టీలోని తమ స హచర నేతపై మండిపడుతున్నారు. ఫ్లోరిడా గవర్న ర్ నాటకాలు ఆడుతున్నారు.
పైకి ఓ మాట లోపల మరో మాటగా మారారని విమర్శించారు. అయితే డెమోక్రాట్ల తరఫున తి రిగి బైడెన్ రంగంలోకి దిగితే ఆయన వయస్సు , కొ న్ని వైఫల్యాల దశలో తిరిగి దేశాధ్యక్ష పదవి రేస్‌లో రిపబ్లికన్లు దూసుకువెళ్లే అవకాశాలు ఉంటాయి. 76 ఏండ్ల గుత్తాధిపత్యపు ట్రంప్‌తో పోలిస్తే ఈసారి కొత్త అభ్యర్థితోనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచన పాతుకుపోతోంది.