Friday, December 20, 2024

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

అట్లాంటా: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదయిన నేపథ్యంలో ఆయన పోలీసులకు లొంగిపోవలసి ఉంది.ఈ మేరకు గురువారం (భారత కాలమానం ప్రకారం శుక్రవారం) జార్జియ జైలు వద్ద పోలీసులకు లొంగిపోయారు. ఇప్పటికే ఆయన స్వయంగా ఫుల్టన్‌కౌంటీ జైలుకు వెళి ్లలొంగిపోయి 2 లక్షల డాలర్ల విలువైన బాండ్ సమర్పించి బెయిలు తీసుకునేందుకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీఫానీ విల్లీస్ అనుమతించారు.దీంతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్ జైలుకు వెళ్లారు. ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటి. ట్రంప్ జైలులో దాదాపు 22 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిలుపై బైటికి వచ్చారు.

ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాము లొంగిపోయినా దాన్ని అరెస్టు కిందే పరిగణిస్తారు. కొద్ది రోజుల క్రితం కూడా 2020 ఎన్నికలకు సంబంధించిన కేసులోనే ట్రంప్ అరెస్టయ్యారు. అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ వాదించారు.అట్లాంటా ఎయిర్‌పోర్టునుంచి జైలుకు తిరిగి అక్కడినుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే సమయంలో ఆయనవెంట పెద్ద సంఖ్యలో పోలీసులు మోటారు వాహనాల్లో వెంబడించారు. గతంలో కూడా ట్రంప్ పోలీసుల ముందు లొంగి పోయినప్పటికీ ఈ సారి మాత్రం మగ్‌షాట్‌తీయించుకున్న (పోలీసు రికార్డుల్లోకి ఎక్కడం కోసం ఫోటో దిగిన)తోలొ అమెరికా అధ్యక్షుడిగా రికార్డుల్లోకి ఎక్కారు.పోలీసుల రికార్డులు ప్రకారం ట్రంప్ 6.3 అడుగుల ఎత్తు, 97 కిలోల బరువు ఉన్నారు.ఆయనకు నీలి కళ్లు, స్ట్రాబెర్రీ రంగు హెయిర్ ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు.

మగ్‌షాట్ ఫొటోతో మళ్లీ ట్విట్టర్‌లోకి ట్రంప్
కాగా తన మగ్‌షాట్ ఫొటోను ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడం ద్వారా మళ్లీ దానిలోకి ప్రవేశించారు.‘ ఎన్నికల్లో జోక్యం.. ఎప్పుడూలొంగను’ అన్న క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ట్వీట్‌ను కేవలం రెండు గంటల్లోనే 4.2 కోట్ల మంది వీక్షించారు. రెండు లక్షల సార్లు రీ ట్వీట్ చేశారు. వాస్తవానికి ట్రంప్‌ను 2021జనవరి 6 వ ట్రంప్‌ను ట్విట్టర్ బ్యాన్ చేసింది. ఆ తర్వాత యాజమాన్యం మారి ట్విట్టర్ పగ్గాలు ఎలాన్ మస్క్ చేతికి వచ్చాక గత నవంబర్‌లో ట్రంప్‌పై బ్యాన్‌ను ఎత్తివేశారు. అయితే ట్రంప్ మాత్రం ట్విట్టర్‌కు దూరంగానే ఉన్నారు. ఇప్పుడు తొలిసారి తన ఖాతాలో మగ్‌షాట్‌ను పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News