Monday, December 23, 2024

కొలరాడో నిషేధం ఎత్తేయండి:ట్రంప్

- Advertisement -
- Advertisement -

డెన్వెర్ : ఎన్నికలలో పోటీకి కొలరాడో న్యాయస్థానం విధించిన నిషేధాన్ని అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సవాలు చేశారు. జాతీయ స్థాయి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. 2021 జనవరి 6 నాటి క్యాపిటల్ హిల్స్ ఘటనల పర్యవసానాలు ట్రంప్‌ను ఇప్పటికీ వీడకుండా వేటాడుతున్నాయి. అప్పటి ఘటనలకు ట్రంప్ ప్రేరకుడు అని పేర్కొంటూ ఇటీవలే కొలరాడో ప్రాంతీయ అత్యుత్తమ న్యాయస్థానం నిర్థారించింది. ట్రంప్ పేరు కొలరాడో నుంచి ఎన్నికల బ్యాలెట్‌లో ఉండకుండా చేస్తూ నిషేధం విధించింది. దీనిని ట్రంప్ తరఫున లాయర్లు సుప్రీంకోర్టులు నిలదీశారు.

కొలరాడో కోర్టు తీర్పును ఎత్తివేసి, పోటికి దిగేందుకు తనకు అవకాశం కల్పించాలని విన్నవించుకున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో ట్రంప్‌ను అధ్యక్ష పదవికి అనర్హుడిగా ప్రకటించాలని పేర్కొంటూ పిటిషన్లు దాఖలు చేసిన ప్రత్యర్థులు ఆయనకు వ్యతిరేకంగా బలీయ సాక్షాధారాలను పొందుపరుస్తున్నారు. మునుపటి అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ప్రతిఘటించాలని ప్రజలను ట్రంప్ రెచ్చగొట్టారని , దీనితో దేశంలో ఓ దశలో అరాచకమూకలు విజృంభించాయని పిటిషన్లు దాఖలు అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News