Sunday, December 22, 2024

ట్రంప్ ఆస్తుల స్వాధీనం?

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్ష పీఠాన్ని మరోసారి అధిరోహించాలని ఆరాటపడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆయన ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధమవుతోంది. గతంలో ఒక మోసం కేసులో ట్రంప్ తోపాటు ఆయన కుమారులు జూనియర్ ట్రంప్, ఎరిక్ ట్రంప్ లపైనా, ట్రంప్ ఆర్గనైజేషన్ పైనా కోర్టు 355 మిలియన్ డాలర్లు జరిమానా విధించింది. దీన్ని చెల్లించడంలో ట్రంప్ నిర్లక్ష్యం వహించారు.

ఫలితంగా ఈ మొత్తం ఇప్పుడు 454 మిలియన్ డాలర్లకు చేరింది. జరిమానా చెల్లింపులో ట్రంప్ వర్గీయులు సానుకూలంగా లేకపోవడంతో వారి ఆస్తుల స్వాధీనానికి న్యూ యార్క్ అటార్నీ జనరల్ రంగంలోకి దిగారు. ఉత్తర మాన్ హట్టన్ లో ట్రంప్ పేరిట ఉన్న సెవన్ స్ప్రింగ్స్ అనే ప్రైవేట్ ఎస్టేట్ ను, ఒక గోల్ఫ్ కోర్సును స్వాధీనం చేసుకునేందుకు అటార్నీ జనరల్ ప్రయత్నాలు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News