Sunday, December 22, 2024

జో బైడెన్ బలహీనత వల్లే రష్యా రెచ్చిపోతోంది: ట్రంప్

- Advertisement -
- Advertisement -

Donald Trump Blames Joe Biden

వాషింగ్టన్: ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, నాటోపై విరుచుకుపడ్డారు. ఫ్లోరిడాలోని ఓర్లాండ్‌లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బలహీనత కారణంగానే రష్యా పొరుగు దేశమైన ఉక్రెయిన్‌పై దాడులు చేసిందని విమర్శించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ ద్వారా తమని ఓడించి ఉండకపోతే, ఈ భయంకర విపత్తు జరిగేదే కాదని అన్నారు. “పుతిన్ తెలివైనవాడు అనేది సమస్య కాదు; కానీ మన నాయకులు మౌనంగా ఉండిపోవడమే అసలైన సమస్య” అని ఆయన చురకలంటించారు. ఏడాదిపాటుగా ప్రవాసంలో గడిపిన ట్రంప్ శనివారం రిపబ్లికన్ పార్టీ వార్షిక సమావేశంలో కనిపించారు.తాను 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా నాలుగో రోజూ కూడా సైనిక దాడులను కొనసాగిస్తోంది. వ్యూహాత్మక నగరం నోవా కఖోవ్‌కాను రష్యా సైన్యం స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్‌పై క్షిపణులతో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News