Saturday, April 19, 2025

పనికి మాలిన హార్వర్డ్

- Advertisement -
- Advertisement -

చదువులు తక్కువ…చావుతెలివితేటలెక్కువ
లెఫ్ట్ మేయర్ల నిధులతో తప్పుడు దారి
ప్రముఖ వర్శిటీపై ట్రంప్ ఫైర్

వాషింగ్టన్ : హార్వర్డ్ వర్శిటీ పేరు గొప్ప ఊరు దిబ్బ బాపతు అని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. హార్వార్డ్ ఓ జోక్ అని, అది చదవుకునే వేదిక కాదని తెలిపారు. ఇటీవలే అమెరికాలో ట్రంప్ అధికార యంత్రాంగం హార్వర్డ్ విద్యాసంస్థకు దాదాపుగా 2.3 బిలియన్ డాలర్ల గ్రాంటును నిలిపివేసింది. ఇకపై ఈ సంస్థ కార్యకలాపాలను కుదించాల్సి ఉందని కూడా ఉత్తర్వులు వెలువరించారు. దీనితో ఈ ప్రముఖ సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అయింది. హార్వర్డ్ ఎప్పుడూ జాతి విద్వేషకర ధోరణులకు పాల్పడుతూ వస్తోంది.

సంకుచిత భావాల వారితో వర్శిటీని నింపుతున్నదని, ఫలితం కూడా ఈ విధంగానే ఉంటోందని చెప్పారు. హార్వర్డ్‌కు ఇంతవరకూ ఉన్న పన్నుల మినహాయింపు సౌకర్యాన్ని ఎత్తివేయడం జరుగుతుందని కూడా ట్రంప్ హెచ్చరించారు. కొన్ని నగరాల మేయర్ల నుంచి ఈ సంస్థకు అడ్డగోలుగా నిధులు అందుతున్నాయి. వీటి దుర్వినియోగం జరుగుతోందని విమర్శించారు. న్యూయార్క్, చికాగోల డెమోక్రాట్ మేయర్లు వామపక్ష భావజాలంతో వ్యవహరిస్తున్నారని, వీరి ధోరణి ప్రమాదకరంగా మారిందని విమర్శించారు. హార్వర్డ్ ఇటీవలి కాలంలో అగ్రశ్రేణి వర్శిటీల జాబితాలో ఎక్కడా కన్పించడం లేదని, వెనుకబడుతోందని, పైగా విద్వేషకర భావజాలానికి వేదిక అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విద్యాసంస్థ వ్యవహారం ఇప్పుడు ఓ జోక్‌గా మారింది. అందరికి షాకు ఇస్తోందని విమర్శించారు.

బెదిరింపులకు లొంగేది లేదు ః అలన్ గర్బర్

తమ విద్యాసంస్థపై ట్రంప్ చేసిన ఆరోపణలను దీని సారధి అలన్ గర్బర్ తోసిపుచ్చారు. ఇవి బెదిరింపులని, వీటిని తాము పట్టించుకునేది లేదని స్పష్టం చేశారు. వర్శిటీ బోధనా సిబ్బందికి, పౌరులకు ఓ లేఖ రాశారు. ఈ విద్యాసంస్థ స్వేచ్ఛ స్వాతంత్య్రాలను ఎవరూ కాదనడానికి వీల్లేదని తెలిపారు. వైట్‌హౌస్ వర్గాల అధికారిక అతిక్రమణ చెల్లనేరదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News