Saturday, March 1, 2025

నీళ్లు లేవు..చేతులకు బేడీలు

- Advertisement -
- Advertisement -

అమెరికా నుంచి సైనిక
విమానాల్లో వెళ్లిన బ్రెజిలియన్ల
గోడు అమానవీయంగా
అక్రమ వలసదారులను
తరలిస్తున్న అమెరికా
గురుద్వారాల్లో కొనసాగుతున్న
వేట సిక్కుసంఘాల
అభ్యంతరం
సహకరించకుంటే చర్యలు
తప్పవు ప్రపంచ దేశాలకు
డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఆంక్షల భయంతో
వెనక్కి తగ్గిన కొలంబియా

మనాస్ (బ్రెజిల్) : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రం ప్ అక్రమ వలసదారులను బలవంతంగా పంపివేయడంతో చాలా మంది ఇక్కట్ల పాలయ్యారు. బ్రెజిల్ కు చెందిన అక్రమ వలసదారులను యూఎస్ నుంచి బలవంతంగా సైనిక విమానాల్లో చేతులకు బేడీలు వేసి మ రీ పంపివేశారు. అమెరికా నుంచి నాలుగు గంటలు ప్ర యాణించి దాదాపు 88 మంది బ్రెజిలియన్లు మనాస్ విమానాశ్రయం చేరారు.. తమను చేతులకు బేడీలు వే సి సైనిక విమానంలో బలవంతంగా కుక్కి, బ్రెజిల్ కు పంపించారు. ఆ విమానాల్లో మంచినీళ్లుకానీ, ఏసీ కా నీ, కనీసం బాత్ రూమ్ కు వెళ్లే సౌకర్యం కానీ లేవని బ్రెజిల్ చేరినవారు వాపోయారు. గడ్డకట్టే చలిలో, ఏసీ లేకుండా నాలుగు గంటలపాటు నరకయాతన అనుభవించినట్లు వారు పేర్కొన్నారు. తమ పౌరులను చేతులకు బేడీలు వేసి , బలవంతంగా సైనిక విమానంలో పంపిన అమెరికా చర్యను బ్రెజిల్ ఖండించింది. దుర్భర పరిస్థితుల్లో బ్రెజిల్ చేసిన వారు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎయిర్ పోర్ట్ లో తమ గోడు వినిపించారు. బ్రిజిల్ మీడియా ఈ ఉదంతాన్ని ప్రముఖంగా ప్రచురించింది.

గురుద్వారాల్లో అమెరికా వేట
న్యూయార్క్ : అమెరికాలో అక్రమంగా వలస ఉన్నవారి కోసం అధికారుల వేట ప్రారంభించారు. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ లోని గురుద్వారాలలో వారి కోసం గాలిస్తున్నారు. అక్రమ వలసదారుల కోసం గురుద్వారాలలో చొరబడడం వల్ల తమ మత విశ్వాసాలు దెబ్బతింటాయని సిక్కు సంస్థలు హెచ్చరించడంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆచీ తూచీ వ్యవహరించనుంది. గతంలో బైడెన్ హయాంలో గురుద్వారాలు, పూజా స్థలాలు వంటి పవిత్ర ప్రదేశాలలో పోలీసులు వెళ్లడాన్ని నివారించింది. అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ శాఖ ప్రస్తుతం అక్రమ వలసదారులకోసం అక్కడే వేట సాగిస్తోంది. గురుద్వారాలు సిక్కు వేర్పాటు వాదుల అడ్డాగా తయారయ్యిందని, తగిన పత్రాలు లేని, అక్రమ వలస దారులు ఇక్కడే తిష్ట వేశారని భావించడంతో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ న్యూయార్క్, న్యూ జెర్సీ లోని గురుద్వారాలనే టార్గెట్ చేస్తోంది. పవిత్ర ప్రదేశాలుగా పేర్కొంటున్న ఈ ప్రదేశాల విషయంలో గతంలో బై

డెన్ ప్రభుత్వం అమలు చేస్తున్న మార్గదర్శకాలను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ యాక్టింగ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ బెంజమైన్ హఫ్ఫ్‌మన్ రద్దు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్,, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. హంతకులు, రేపిస్డ్ లతో సహా క్రిమినల్స్ ను, అక్రమ వలసదారులను పట్టుకుని చట్టాన్ని అమలు చేయాలని ఈ విభాగాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. క్రిమినల్స్ ఎవరూ అమెరికా స్కూళ్లలో కానీ, చర్చ్ లలో కానీ తలదాచుకునేందుకు వీలు లేదని, అలాంటి వారి విషయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సెక్యూరిటీ విభాగాల అధికారుల చేతులు కట్టివేయబోదని, వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, హోమ్ ల్యాండ్ శాఖ స్పష్టం చేసింది. అమెరికాలో కొత్త గా మారిన పాలసీల పట్ల సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్, ఎడ్యుకేషన్ ఫండ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ అయిన తర్వాత అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు గురుద్వారాలకు వస్తున్నారని ఈ సంస్థ పేర్కొంది. వారు గురుద్వారాలలో దాడులు చేస్తూ, తనిఖీలు, చేస్తున్నారని, అరెస్ట్ లు చేసే అవకాశం ఉందని పేర్కొంది.

సహకరించకుంటే చర్యలు తప్పవు : ట్రంప్
వాషింగ్టన్ : అక్రమ వలసదారుల విషయంలో కొత్త అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నచర్యలను అన్నిదేశాలు సహకరించాలని లేని పక్షంలో కఠినంగా వ్యవహరించవలసి ఉంటుందని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్ ట్రంప్ స్పష్టం చేశారు. కొలంబియాతో సహా ప్రపంచ దేశాలకు ఈ హెచ్చరిక చేశారు. సైనిక విమానాల్లో వెనక్కి పంపిన అక్రమ వలస దారులను తిరిగి యూఎస్ పంపిన కొలంబియా… అక్రమ వలసదారులకు స్వదేశంలోకి పిలుపించుకునేందుకు బేషరతుగా అంగీకరించింది. డిపోర్టేషన్ విషయంలో అమెరికా కు సహకరించని దేశాలపై తీవ్రంగా ఆంక్షలు తప్పవని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. అమెరికాలో ఉన్న తమ పౌరులను అంగీకరించడానికి పూర్తిగా సహకరించని కొలంబియాతో

సహా అన్ని దేశాలపై ఆంక్షలతో పాటు తగిన చర్యలూ తీసుకునేందుకు కాంగ్రెస్ పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రతినిధుల సభ స్పీకర్ మిక్ జాన్సన్ స్పష్టం చేసారు. ట్రంప్ అడ్మినిస్టేషన్ ఆర్డర్ జారీ కాగానే, దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల ఏరివేత మొదలైంది. కొన్ని చోట్ల దాడులు జరిగాయి. షికాగోలో కొందరిని అరెస్ట్ చేశారు. అమెరికా ఫస్ట్… అన్న ట్రంప్ నినాదం నిజం చేసేందుకు, ప్రెసిడెంట్ ఆదేశాలు కచ్చితంగా అమలు జరిగేలా చూసేందుకు కాంగ్రెస్ పాలనాయంత్రాంగంతో పూర్తి సహకరిస్తుందని జాన్సన్ వెల్లడించారు. కొలంబియా కు చెందిన అక్రమ వలసదారులతో వచ్చిన సైనిక విమానాలను కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో తిప్పి పంపిన తర్వాత ఆగ్రహించిన ట్రంప్ 25 శాతం దిగుమతి సుంకాలను పెంచుతో తీసుకున్న నిర్ణయాన్ని ప్రతినిధుల సభ స్పీకర్ సమర్థించారు. దాంతో దిగివచ్చిన కొలంబియా ప్రెసిడెంట్ బేషరతుగా తమ దేశానికి చెందిన వలసదారులను వాపస్ తీసుకునేందుకు అంగీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News