Sunday, December 22, 2024

వివేక్ రామస్వామిపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొట్టమొదటిసారి తన ప్రత్యర్థి వివేక్ రామస్వామిపై విరుచుకుపడ్డారు. ఇండోఅమెరికన్ వాణిజ్యవేత్త అయిన వివేక్ మోసపూరిత ప్రచారం సాగిస్తున్నారని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. లోవా రాష్ట్రంలో సోమవారం చతుర్ వార్షిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాను న్న నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో అధ్యక్ష అభ్యర్థిని రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎన్నుకుంటారు. 38 ఏళ్ల రామస్వామి నుంచి అనేక వ్యాఖ్యలు, పోస్ట్‌లు వెలువడిన తరువాత ట్రంప్ తీవ్ర ంగా స్పందించారు. రామస్వామికి చెందిన కొంతమంది యువకులు తాము ధరి ంచిన షర్టుల మీద “సేవ్ ట్రంప్, ఓట్ వివేక్‌” అన్న నినాదాలు ఉన్నాయి.

లోవాలోని రాక్ రాపిడ్స్‌లో శనివారం జరిగిన ప్రచార కార్యక్రమంలో నినాదాలతో ఉన్న షర్టులను యువకులు ధరించారు. ఈ ఫోటోలను షేర్ చేయడంతో అవి ట్రంప్ దృష్టికి వెళ్లాయి. దాంతో వివేక్ ప్రచార తీరుపై ధ్వజమెత్తారు. ట్రంప్ గొప్ప ప్రెసిడెంట్ అని ప్రశంసిస్తూ ట్రంప్‌కు గొప్ప మద్దతుదారునిగా వివేక్ మొదట ప్రచారం ప్రారంభించారు. కానీ యువకుల షర్టులపై నినాదాలతో కథ మారింది. వివేక్ మాయలో పడవద్దని హెచ్చరిస్తూ “ ఓట్ ఫర్ ట్రంప్… మీ ఓటు వృధా చేయవద్దు” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News