Saturday, February 15, 2025

బ్రిక్స్ దేశాలకు ట్రంప్ అక్కసు

- Advertisement -
- Advertisement -

బ్రిక్స్ దేశాలపై ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని తీసుకువచ్చేందుకు బ్రిక్స్ కూటమి దేశాలు ప్రయత్నిస్తుండటమే ట్రంప్ ఉక్రోషానికి కారణం. బ్రిక్స్ కూటమిలో భారత్ సభ్యదేశం అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని అమెరికా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీకి కొన్ని గంటల ముందే ట్రంప్ బ్రిక్స్ దేశాలను హెచ్చరించడం గమనార్హం.

బ్రిక్స్ తీసుకొచ్చిన ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదన చాలామందికి ఇష్టం లేదని, డాలర్‌తో వారు ఆడుకోవాలనుకుంటే కఠిన చర్యలు తీసుకుంటానని వారు భయపడుతున్నట్టు ట్రంప్ చెప్పడం కలవరం కలిగిస్తోంది. అమెరికాకు వ్యతిరేకంగా ఆయా దేశాలు ఏమైనా చర్యలు తీసుకుంటే ఆ దేశాల దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అంతేకాదు నా బెదిరింపులతో ‘బ్రిక్స్ అంతమైంది’ అని ఎద్దేవా చేశారు. 2011లో బ్రిక్స్ కూటమి ఏర్పాటైంది. ఈ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌతాఫ్రికా, ఈ ఐదు దేశాలకు సభ్యత్వం ఉండగా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కొత్తగా చేరాయి.

మున్ముందు 130 దేశాలు కూటమిలో చేరే అవకాశం ఉందని అంచనా. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, కూటమి దేశాలు ఆర్థిక లావాదేవీల్లో అమెరికా డాలర్‌పై ఆధారపడకుండా ఉండడానికి బ్రిక్స్ దేశాలు యోచిస్తున్నాయి. ఇప్పటికే బ్రిక్స్ దేశాలు 65% లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలో జరుపుతున్నాయి. డాలర్‌కు, బంగారానికీ సంబంధాన్ని తొలగించిన అమెరికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతోపాటు, మల్టీ కరెన్సీ ప్లాట్‌ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం కనిపిస్తోంది.

అమెరికా డాలర్‌పై ఆధారపడడాన్ని తగ్గించుకోడానికి ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదనను బ్రెజిల్ అధ్యక్షుడు లూలాడాసిల్వా 2023లో తెరపైకి తెచ్చారు. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత ఆర్థిక ఆంక్షలతో సతమతమవుతున్న రష్యాకు, డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేసే చైనాకు ఈ ప్రతిపాదన నచ్చింది. 2024 అక్టోబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్ సదస్సు జరిగింది. భౌగోళిక, ఆర్థిక, రాజకీయపరంగా అనేక మార్పులు వస్తున్న తరుణంలో ఈ సదస్సు ఆర్థిక వ్యవస్థలపై విస్తృతంగా చర్చించింది. బ్రిక్స్ నేతృత్వం లోని అంతర్జాతీయ ఆర్థిక చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రతిపాదించాయి.

అలాగే స్థానిక కరెన్సీల వినియోగాన్ని ఉమ్మడి కరెన్సీ ద్వారా విస్తరింప చేయడానికి బ్రిక్స్ నాయకులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అనేక సూచనలు చేశారు. ఉమ్మడి కరెన్సీ రూపొందించడంపై దృష్టిపెట్టాలని పిలుపునిచ్చారు. అయితే బ్రిక్స్ 10 దేశాలకు ఉమ్మడి కరెన్సీ తీసుకువచ్చేందుకు సమయం ఇంకా ఆసన్నం కాలేదన్నారు. ఈ దిశలో నెమ్మదిగా అడుగులు వేయకుంటే ఐరోపా సమాఖ్యకు ఎదురైన సమస్యల కంటే పెద్దవే ఎదురవుతాయని హెచ్చరించారు.

ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీని వాడుకునేందుకు భారత్‌తో కలిసి రష్యా పని చేస్తోందని చెప్పారు. సభ్యదేశాలు కొత్త ఆర్థిక సాధనాలు వినియోగించుకోవాలని, సెంట్రల్ బ్యాంకులతో ఆయా దేశాలకు సంబంధాలు ఏర్పడాలని సూచించారు. డాలర్ వాడకం సరైనదేనా అన్న ఆలోచనలో యావత్ ప్రపంచం ఉందని, అందుకే చెల్లింపుల్లో రిజర్వుల్లో డాలరు పరిమాణం తగ్గుతోందని ఉదహరించారు. అమెరికా మిత్రదేశాలు కూడా డాలర్ నిల్వల్ని తగ్గించుకుంటున్నాయని స్పష్టం చేశారు.

ఈ కూటమి దేశాల అభిప్రాయాలను పరిశీలిస్తే అమెరికా డాలర్ చెలామణిపై ఎంత నిరాసక్తతతో ఉన్నాయో తెలుస్తుంది. ఈ పరిస్థితులన్నిటినీ మొదటి నుంచి గమనిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను దేశాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టక ముందునుంచీ బ్రిక్స్ దేశాల ప్రయత్నాలను తూర్పారబడుతున్నారు. గత డిసెంబర్‌లో కూడా ఆయన బ్రిక్స్ దేశాల ప్రయత్నాలను ఖండించారు. బ్రిక్స్ దేశాలపై గురి పెట్టారు. మీరు అమెరికాకు రావొచ్చు, పోవొచ్చు.. కానీ విదేశీ మారకం మాత్రం డాలర్లలోనే ఉండాలి. అమెరికాలో ఎగుమతులు, దిగుమతులు లావాదేవీలు మాత్ర ఫక్కాగా డాలర్లలోనే జరగాలని కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేశారు. అలా కూడదంటే వందశాతం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News