Sunday, September 22, 2024

ఫౌచీపై నోరు పారేసుకున్న ట్రంప్

- Advertisement -
- Advertisement -

Donald Trump has deems Anthony Fauci idiot

 

కరోనాపై దేశ ప్రజలు విసిగిపోయారు
ఆయన మాటలు వింటే దేశంలో 78 లక్షల మంది చనిపోయి ఉండేవారని వ్యాఖ్య

వాషింగ్టన్: అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు పారేసుకున్నారు. ఆయనను ‘ఇడియట్’ అంటూ సంబోధించారు. దేశంలో కరోనా కట్టడి విషయంలో ట్రంప్ విధానాల్లో లోపాలను నిర్మొహమాటంగా ఎత్తి చూపించే ఫౌచీ తీరు అధ్యక్షుడిగి కంటగింపుగా మారింది. మాస్కుల వాడకంలో నిర్లక్ష్యం, అలాగే కొవిడ్ చికిత్స అనంతరం కరోనా నెగెటివ్ అని తేలకముందే శ్వేత సౌధానికి వచ్చి మాస్క్‌ను పక్కన పెట్టడం.. ఇలా అధ్యక్షుడి ప్రతి చర్యనూ ఫౌచీ తప్పుబడుతూనే ఉన్న విషయం తెలిసిందే. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఫౌచీపై అక్కసు వెళ్లగక్కారు. ‘ ఏది ఏమైనా మమ్మల్ని వదిలేయండని ప్రజలు అంటున్నారు. కొవిడ్‌తో వారు విసిగిపోయారు. ఫౌచీ, ఇతరులు చెప్పే మాటలను వారు విని అలసి పోయారు’ అంటూ పరుష పదజాలం వాడారు. ఫౌచీ తదితరులను ఇడియట్స్ అంటూ సంబోధించారు. ‘ ఆయన 500 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు.

ఆయన మాటలను గనుక మనం విని ఉంటే ఏడులక్షలనుంచి ఎనిమిది లక్షల వరకు మరణాలు సంభవించి ఉండేవి’ అని ట్రంప్‌మండిపడ్డారు. డెమోక్రాట్లు మొదలుకొని రిపబ్లికన్లు సహా అనేక మంది అధ్యక్షుల వద్ద పని చేసిన ఫౌచీ దేశంలో అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. అయితో కొవిడ్ కట్టడి విషయంలో ట్రంప్ ఫౌచీ సలహాలను మొదటినుంచీ పెడచెవిన పెడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఫౌచీ ట్రంప్ కరోనా బారిన పడడం తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని, ఎందుకంటే ఆయన చుట్టూ మాస్కులు ధరించకుండా ఉండే చాలా మంది ఉండడం చూసిన తనకు ఇది ఎంతమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని వ్యాఖ్యానించారు.

కాగా ట్రంప్ విమర్శల తర్వాత ఆయన పార్టీకే చెందిన సెనెటర్ లామర్ అలెగ్జాండర్‌నుంచి ఫౌచీకి మద్దతు లభించడం గమనార్హం. ‘రోనాల్డ్ రీగన్‌నుంచి మొదలుకొని ఆరుగురు అధ్యక్షుల వద్ద ఫౌచీ పని చేశారు. ఆయన సూచనలను గనుక ఎక్కువ మంది అమెరికన్లు పాటించి ఉంటే దేశంలో కరోనా కేసులు తక్కువగా ఉండి ఉండేవి. పాఠశాలలకు, ఉద్యోగాలకు, తినడానికి పరిస్థితులు మరింత అనుకూలంగా ఉండి ఉండేవి’ అని అలెగ్జాండర్ అన్నారు. ఇదిలా ఉండగా కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన అగ్రరాజ్యం అమెరికాలో 84,56,653 మంది వైరస్ బారిన పడగా,2,25,222 మంది మరణించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News