న్యూఢిల్లీ : యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) వలస చట్టాలను క ట్టుదిట్టం చేస్తోందని భారత్ లో ని అమెరికన్ రాయబార కార్యాలయం మంగళవారం తెలియజేసింది. యుఎస్ సైనిక విమానం ఒకటి సుమారు 205 మంది అ క్రమ వలసదారులతో వస్తున్నద న్న వార్తల నడుమ దౌత్య కార్యాలయం ఆ వ్యాఖ్య చేసింది. అమెరికా నుంచి తిరిగి పంపిస్తున్న భారతీయులకు పంజాబ్ ప్రభు త్వ అధికారులు
అన్నారు. ఇది ఇలా ఉండగా, డొనాల్డ్ ట్రంప్ రెండవ విడత యుఎస్ అధ్యక్షుడు అయిన తరువాత సుమారు రెండు వారాలకు యుఎస్ నుంచి అక్రమ భారతీయుల తరలింపు మొదటి రౌండ్ మొదలైంది. యుఎస్‌లో నివసిస్తున్న అక్రమ వలసదారుల విషయంలో కఠిన విధానాన్ని అనుసరిస్తామని ట్రంప్ వాగ్దానం చేశారు. తదనుగుణంగానే ఆయన అక్రమ వలసదారులకు సంబంధించిన కొన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఇప్పటికే సంతకం చేశారు. భారత్‌కు అక్రమ వలసదారులు కొందరిని వెనుకకు తీసుకువస్తున్న విమానం గురించిన ప్రశ్నకు యుఎస్ ఎంబసీ అధికార ప్రతినిధి వివరాలు వెల్లడించలేదు, కానీ వాషింగ్టన్ అక్రమ వలసదారులను పంపివేస్తున్నదని స్పష్టం చేశారు.