1.34లక్షల మంది హెచ్4
వీసాదారుల్లో కలవరపాటు
21 ఏళ్లు దాటిన వారికి
డిపెండెంట్ హోదా హుళక్కి
వేటు పడుతుందన్న భయంలో
నవ యువకులు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికాలోని వలసదారు ల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు భయకంపితులను చేస్తున్నా యి. ఓ దశలో వారికి కంటిమీద కునుకులేకుం డా పోతోంది. ఇప్పటి వరకు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా ప్రభు త్వం వీసా గడువు ముగిసిన వారిపైనా బహిష్కరణ చర్యలుంటాయని హెచ్చరికలు పంపుతోంది. ఈ నేపథ్యం లో హెచ్1బి వీసా దారుల పిల్లలు అంటే డిపెండెంట్ వీసా కింద అమెరికా వచ్చిన హెచ్4 వీసా దారులను కలవరపాటుకు గురిచేస్తోంది. ము ఖ్యంగా 21 ఏళ్ల వయస్సుకు చేరుకున్న వారిని ఇది మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తమ భవిష్యత్ విషయంలో అనిశ్చిత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ప్రస్తుత ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం వారికి హెచ్ 1బి వీసా పొందిన తల్లిదండ్రుల కింద ఆధారపడిన డిపెండెంట్ హోదా వర్తించదు. వయస్సు పెరిగిన తర్వాత వారు మరో వీసాకు మారడానికి రెండేళ్ల వ్యవధి ఉండేది. కానీ, వలస విధానంలో ఈ మధ్యవచ్చిన మార్పుల వల్ల వారి భవిష్యత్ అయోమయంలో పడింది.
మార్చి 2023 నాటికి, దాదాపు 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు 21 సంవత్సరాలు దాటినట్లు అంచనా. చాలా మంది ఇప్పుడు ఆ గండం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నారు. కొందరు స్టూడెంట్ వీసా సంపాదించి అమెరికాలోనే ఏదో యూనివర్సిటీలో చేరే ఆలోచన చేస్తుంటే, మరి కొందరు కెనడా లేదా బ్రిటన్ వంటి దేశాలకు వలసపోయి అక్కడ చదువు సాగించే ఆలోచన చేస్తున్నారు. అమెరికాతో పోల్చి చూస్తే ఆ దేశాలలో కాస్త సరళమైన విధానాలు ఉన్నాయి. ఇక అమెరికాలో ఉపాధి పొందేందుకు గ్రీన్ కార్డు వ్యవస్థ వీలు కల్పిస్తున్నా. ఇప్పటికే చాలామంది గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా, చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం భారతీయ వలసదారుల ఆవేదనకు కారణమవుతోంది. అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్ సర్వీసెస్ 2026 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బి వీసాల రిజిస్ట్రేషన్ వ్యవధి ప్రకటించింది. ఈ ప్రక్రియ మార్చి 7న ప్రారంభమై మార్చి 24 వరకూ కొనసాగుతుంది. అమెరికా లో కంపెనీలు సాంకేతిక నిపుణులైన విదేశీ కార్మికులనునియమించుకోవడానికి హెచ్-1బి వీసా, నాన్- ఇమిగ్రెంట్ వీసాలు వీలు కల్పిస్తాయి. హెచ్1 -బి వీసాలను ఈ సంవత్సరానికి 65వేలుగా నిర్ణయించారు.
యుఎస్ మాస్టర్స్ డిగ్రీలు ఉన్నదరఖాస్తుదారులకు అదనంగా మరో 20 వేలు వీసాలు ఇస్తారు. కొత్త రిజిస్ట్రేషన్ ఫీజు 215 అమెరికా డాలర్లు. వీసాల ఎంపికలో ఎలాంటి అవినీతి జరగకుండా యుఎస్ సిఐఎస్ ఈ ప్రక్రియ నిర్వహిస్తుంది. మార్చి 2023 నాటికి, దాదాపు 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు 21 ఏళ్లు దాటే స్థితిలో ఉన్నారు. వారి లో చాలామంది తల్లిదండ్రులు శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్ కు దరఖాస్తు చేసుకున్నా.. ఇంకా చాలా కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి. కొన్ని దరఖాస్తులు ఓకే అయ్యేందుకు 12 ఏళ్ల నుంచి వంద ఏళ్లవరకూ పట్టవచ్చుఅని అంచనా. అమెరికాలో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్ హుడ్ అరైవల్స్ (డిఏసిఏ) కార్యక్రమం కింద కొత్త దరఖాస్తుదారులకు వర్క్ పర్మిట్ ను అడ్డుకుంటున్నట్లు ఈ మధ్య టెక్సాస్ కోర్టు తీర్పు ఇన్వడంతో పరిస్థితి మరింత దిగజారింది. 21 ఏళ్లు నిండిన తర్వాత డిపెండెంట్ స్టేటస్ కోల్పోయే యువకులు, సరైన డాక్యుమెంట్లు లేని యువకులు బహిష్కరణకు గురికాకుండా డిఏసిఏ రెండేళ్ల తాత్కాలిక ఊరట కల్పిస్తుంది. ఆయినా ఈ నిబంధనతో నిమిత్తం లేకుండాచాలామంది తమ భవిష్యతం గురించి ఆందోళన చెందుతున్నారు.