Monday, November 25, 2024

ట్రాన్స్‌జెండర్లకు ట్రంప్ షాక్

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత కీలక నిర్ణయాలు ట్రంప్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికా ఆర్మీలో ఉన్న ట్రాన్స్‌జెండర్లను ట్రంప్ పూర్తిగా తొలగించనున్నట్టు ది సండే టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రమాణ స్వీకారం తరువాత ట్రాన్స్‌జెండర్లను తొలగించే ఫైలుపై ట్రంప్ సంతకం చేయనున్నట్టు తెలియజేసింది. ఓవైపు ఆర్మీ లోకి కొత్తవారి నియామకం అంతగా లేని ప్రస్తుత సమయంలో ట్రంప్ ట్రాన్స్‌జెండర్లను తొలగించనుండడం చర్చనీయాంశం అవుతోంది.

ట్రాన్స్‌జెండర్లు ఆధునిక ఆర్మీ అవసరాలకు తగినట్టు సేవలందించడం లేదని ట్రంప్ నిర్ణయించారు. ఆర్మీ నుంచి ట్రాన్స్‌జెండర్లను తొలగించేటప్పుడు అన్ని గౌరవాలు ఇచ్చి పంపిస్తారని తెలుస్తోంది. ట్రంప్ మొదటి పాలనా కాలంలో కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ట్రాన్స్ జెండర్లను ఆర్మీ లోకి తీసుకోవటాన్ని మాత్రమే ట్రంప్ నిషేధించారు. అప్పటికే ఉన్నవారిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. బైడెన్ అధికారం చేపట్టిన తరువాత ఆ ఆదేశాలు రద్దు అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News