Wednesday, January 22, 2025

టూ ఇంటలిజెంట్ వివేక్‌పై ట్రంప్ కామెంట్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : రిపబ్లికన్ అభ్యర్థి , ఇండో అమెరికన్ వివేక్ రామస్వామిని అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. వివేక్ స్మార్ట్, యంగ్ అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఎంపిక కోసం ఇప్పుడు అంతర్గత పోటీ సాగుతోంది. కాగా 38 ఏండ్ల రామస్వామి ఓ ప్రముఖ వ్యాపారవేత్తగా పార్టీ అభ్యర్థిగా ముందుకు వచ్చారు. డిబేట్‌లో దూసుకువెళ్లారు. ఫండ్ రైజింగ్‌లోనే సాటిలేకుండా ఉన్నారు. వీలైతే ట్రంప్ లేకపోతే నేను అని తాను ఉపాధ్యక్ష పదవికి కూడా సిద్ధం అని ప్రకటించుకున్నారు. ఈ దశలో ట్రంప్ ఓ షోలో మాట్లాడుతూ వివేక్ ఇంటలిజెంట్, ట్యాలెంట్ ఉంది, కాకపోతే కొంత జాగ్రత్తగా వ్యవహరించాలని చురకలు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News