Sunday, January 19, 2025

నా కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకెళ్లింది: ట్రంప్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: కాల్పుల ఘటనపై ట్రూత్ సోషల్ సైట్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకెళ్లిందన్నారు. కాల్పుల శబ్ధం వినగానే ఏదో తేడాగా ఉందని అర్థమైందని, తన చెవిని తాకుతూ తూటా దూసకెళ్లి తీవ్ర రక్తస్రావమైందన్నారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బందికి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.  అమెరికాలోని పెన్సిల్వేనియాలో యుఎస్‌ఎ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ చేపడతుండగా ఆయనపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ట్రంప్ చెవి నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో గాయపడ్డాడు. భద్రతా బలగాలు దుండగుడిపై కాల్పలు జరపడంతో హతమయ్యాడు. ఈ కాల్పుల్లో దుండగుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు. ట్రంప్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News