Tuesday, March 18, 2025

ఉక్కు, అల్యూమినియం సుంకాలపై తగ్గేదే లే: ట్రంప్

- Advertisement -
- Advertisement -

తమ దేశ ఉత్పత్తులపై సుంకాలను విధిస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిసుంకాలతో విరుచుకుపడుతున్నారు. తమ వ్యాపార భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25శాతామున్న సుంకాలను 50 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇటీవల ప్రకటించారు. తాజాగా ఈ విషయంపై మాట్లాడుతూ తమ వ్యాపార భాగస్వాములపై ఏప్రిల్ 2 నుంచి సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదని చెప్పారు. సుంకాలపై ఏ దేశానికీ మినహాయింపులు కల్పించే ఉద్దేశం తమకు లేదని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. “ ఏప్రిల్ 2 మన దేశానికి విముక్తి కలిగించే రోజు. ఇదివరకు అధికారంలో ఉన్న తెలివి తక్కువ అధ్యక్షులు తాము ఏమి చేస్తున్నామో కూడా తెలియకుండా మన సంపదను ఇతరులకు ఇస్తూ పోయారు.

ప్రస్తుతం విధిస్తున్న సుంకాల ద్వారా అందులో కొంత భాగాన్ని తిరిగి పొందబోతున్నాము. ఇన్నాళ్లు వారు మన నుంచి వసూలు చేశారు. వాటన్నిటినీ తిరిగి వసూలు చేసుకోవడానికి ఆయా దేశాలపై అదనపు సుంకాలు విధిస్తున్నాం ” అపి ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం సుంకాలను విధిస్తున్నట్టు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. కెనడా, మెక్సికోసహా ప్రపంచ దేశాలన్నింటికీ ఇది వర్తిస్తుందని తెలిపారు. దీనిపై తమ వాణిజ్య మంత్రికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. మరిన్ని రంగాల్లోనూ సుంకాలను ప్రకటిస్తామని వెల్లడించారు. వారు మన ఉత్పత్తులపై 150 శాతం సుంకాలు విధిస్తుంటే మనం ఏమీ విధించకపోవడం సరికాదుఅని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత సుంకాల అమలు ప్రకటనతో అంతర్జాతీయ వాణిజ్య భాగస్వామ్య సంస్థల్లో ఆందోళన నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News