Thursday, January 23, 2025

వచ్చే వారం సంచలన ప్రకటన చేస్తా: డోనాల్డ్ ట్రంప్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వచ్చే వారం సంచలన ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం మధ్యంతర ఎన్నికలు జరుగుతుండగా సోమవారం రాత్రి ట్రంప్ ఒహియోలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. నవంబర్ 15 వ తేదీన ఫ్లోరిడాలో సంచలన ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. ఆయన మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో ఫోటీ చేయనున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్ దాన్ని అంగీకరించలేదు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News