- Advertisement -
బాలికలు, మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడాన్ని నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డరుపై సంతకాలు చేశారు. “కీపింగ్ మెన్ అవుట్ ఆఫ్ వుమెన్స్ స్పోర్ట్స్” అన్న టైటిల్‌తో తయారైన ఈ ఆర్డరుపై ట్రంప్ సంతకాలు చేశారు. దీంతో అక్కడి ఫెడరల్ గవర్నమెంట్ నిధులతో పనిచేస్తున్న సంస్థలన్నీ టైటిల్ 1x కు కట్టుబడాల్సి ఉంటుంది. దీని ప్రకారం .. పుట్టిన సమయంలో నిర్ధారించిన జెండర్‌ను మాత్రమే అధికారికంగా గుర్తిస్తారు. ఈ నిర్ణయంతో ‘ఉమెన్ స్పోర్ట్‌లో యుద్ధం ముగిసింది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నిషేధానికి చట్టసభ్యులు, మహిళా క్రీడాకారిణులు మద్దతు పలికారన్నారు. టైటిల్ 1x హామీని ఈ ఉత్తర్వు ప్రోత్సహిస్తుందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు.
- Advertisement -