Tuesday, February 11, 2025

మళ్లీ ట్రంప్ పన్నుల మోత

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం పన్ను విధించారు. అది చూసేందుకు సాధారణంగానే కనిపించినా ట్రంప్ తన మొదటి హయాంలో అదే పని చేశారు. ఇబ్బందుల్లో ఉన్న అమెరికా ఉక్కు, అల్యూమినియం ఉత్పాదక సంస్థలకు ట్రంప్ అసలు లోహాల టారిఫ్‌ల వల్ల తీవ్రమైన ప్రపంచ పోటీ నుంచి ఒకింత ఉపశమనం కలిగించాయి. కొత్త టారిఫ్‌ల గురించి ఊహిస్తుండగానే ఉక్కు, అల్యూమినియం ఉత్పాదక సంస్థల వాటాలు సోమవారం ఊర్థ దిశగా సాగాయి. నుకోర్ 5.6 శాతం, క్లీవ్‌లాండ్‌క్లిఫ్స్ 17.9 శాతం, అల్కోవా 2.2 శాతం పెరిగాయి. అయితే, ట్రంప్ టారిఫ్‌లు క్రితం సారి వ్యతిరేక ప్రభావం చూపాయి. అవి కీలక మిత్ర దేశాలతో యుఎస్ సంబంధాలను దెబ్బ తీశాయి, ఉక్కు, అల్యూమినియం కొని వాటిని వస్తువుల తయారీకి ఉపయోగించే ‘దిగువ’ యుఎస్ ఉత్పాదక సంస్థల ఖర్చులను పెంచాయి. అటువంటి సంస్థల్లో ఒకటైన విస్కాన్సిన్ మెరిల్‌లోని మిచెట్ మెటల్ ప్రాడక్ట్ సిఇఒ టిమోతి జిమ్మర్‌మాన్‌కు ఆ కాలపు చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

‘మాపై గణనీయంగా ప్రభావం పడింది’ అని ఆయన చెప్పారు. ‘మేము ఎదుర్కొన్న సవాళ్లు కనివిని ఎరగనివి శీఘ్ర ద్రవ్యోల్బణం ప్రభావాలు దేశీయ ఉక్కు ఉత్పత్తిదారులపై పడ్డాయి. కొన్ని నెలల్లోనే ఉక్కు ధరలు దాదాపు 70 శాతంపైగా పెరిగాయి. మా (ఉక్కు) సరఫరాదారులు తేలికగా కాంట్రాక్టులు రద్దు చేసుకుని ‘దీనిని తీసుకుంటే తీసుకోండి లేదా ఏదీ తీసుకోకండి’ అని అన్నారు’ అని తెలిపారు. అయితే, మిచెల్ మెటల్ ప్రాడక్ట్ తమ సొంత ఖాతాదారులతో కాంట్రాక్టులు కుదుర్చుకుంది. వాటిలో ఫర్నిచర్ తయారీ సంస్థల నుంచి టెలికమ్యూనికేషన్స్ సంస్థల వరకు ఉన్నాయి. అవి అధిక వ్యయాన్ని బదలీ చేయనివ్వలేదు. ఆయన సంస్థ లాభాలు స్తంభించాయి. యూరోపియన్ ప్రత్యర్థి సంస్థలకు ఆయన సంస్థ వ్యాపారాన్ని వదులుకోవలసి వచ్చింది. ఆ సంస్థలు ట్రంప్ టారిఫ్‌ల ప్రభావానికి లోను కాలేదు. అప్పట్లో అమెరికాపై మొత్తంగా ఆర్థిక ప్రభావం పరిమితంగానే ఉన్నది. అది మళ్లీ పరిమితంగానే ఉండవచ్చు, ఎందుకంటే ఉక్కు, అల్యూమినియం దిగుమతులు దాదాపు 30 ట్రిలియన్ డాలర్ల యుఎస్ ఆర్థిక వ్యవస్థలో స్వల్ప మాత్రంగానే ఉంటాయి.

అయినప్పటికీ విదేశీ ఉక్కు, అల్యూమినియంపై కొత్త పన్నులు , ట్రంప్ ఇతర దిగుమతి పన్ను యోచనలు ‘ఈ ఏడాది యుఎస్ ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చు, ప్రపంచ వృద్ధిని ప్రభావితం చేయవచ్చు’ అని క్యాపిటల్ ఎకనామిక్స్‌కు చెందిన జెన్నిఫర్ మెక్‌క్యూన్, హమద్ హుస్సేన్ సోమవారం సూచించారు. కాగా, ఉక్కు, అల్యూమినియం టారిఫ్‌లు యుఎస్ మిత్ర దేశాలకు నష్టం కలిగిస్తాయి. కెనడా యుఎస్‌కు నంబర్ వన్ విదేశీ ఉక్కు, అల్యూమినియం సరఫరా దేశంగా ఉంటున్నది. మెక్సికో ఉక్కు సరఫరా దేశాల్లో మూడవ స్థానంలో ఉన్నది. జపాన్, దక్షిణ కొరియా కూడా యుఎస్‌కు ప్రధాంగా ఉక్కు ఎగుమతి దేశాలు. చైనాను ప్రపంచ ఉక్కు పరిశ్రమ సమస్యలకు మూలకారణంగా భావిస్తున్నారు. చైనాలో శ్రుతిమించిన ఉత్పత్తితో ప్రపంచాన్ని ఉక్కుతో ముంచెత్తి, ధరలను స్వల్ప మాత్రంగా ఉండేలా చేసింది. ఇది యుఎస్‌లోను, ఇతర దేశాల్లోను ఉక్కు తయారీ సంస్థలకు నష్టం కలిగించింది. అయితే, చైనా ఉక్కు సరఫరా స్వల్ప మాత్రంగా ఉంచేందుకు యుఎస్ ఇప్పటికు వాణిజ్య ఆంక్షలు ఉపయోగిస్తోంది. నిరుడు యుఎస్ ఉక్కు దిగుమతుల్లో చైనా వాటా రెండు శాతంలోపే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News