Sunday, December 22, 2024

అమెరికా.. ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు: ట్రంప్‌

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరూ ఊహించని విజయం దిశగా దూసుకుపోతున్నారు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్ట్ ట్రంప్. మ్యాజిక్ ఫిగర్ 270కి ఇప్పటికే 267 సీట్లు సాధించిన ట్రంప్ మరో మూడు ఎలక్ట్రోరల్ సీట్లు సాధిస్తే విక్టరీ కొడతారు. ఇప్పటికే ట్రంప్ కు ప్రపంచ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మద్దతుదారులు సంబంరాలు చేసుకుంటున్నారు. విజయం దాదాపు ఖరారు కావడంతో ట్రంప్ విజయోత్సవ మీటింగ్ లో ప్రసంగించారు.

“అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు. అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుంది. ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు పోరాడారు. రిపబ్లికన్‌ పార్టీకి 315 సీట్లు వచ్చే అవకాశం ఉంది. పాపులర్‌ ఓట్లలోనూ రిపబ్లికన్‌ పార్టీదే హవా.
ఘన విజయం అందించిన అమెరికన్లకు ధన్యవాదాలు. ఇది అమెరికన్లు గర్వించే విజయం” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News