Saturday, November 23, 2024

ట్రంపా..హారిసా?

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికా అధిపతి ఎవరో తేల్చే కీలక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల వ్య వధిలో శ్వేతసౌధంలో అడుగుపెట్టేది ఎవరో ఓటర్లు నిర్ణయించనున్నారు. దేశవ్యాప్తంగా రేపు జరగబోయే ఓటింగ్ ప్రక్రియలో
పాలుపంచుకునేందుకు అమెరికన్లు సన్నద్ధమవుతున్నారు. రిపబ్లికన్ల తరపున డోనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు. ఇద్దరు నువ్వానేనా అన్న రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు.ప్రత్యర్థుల నడుమ విజయవకాశాలు స్వల్ప తేడాలోనేదోబూచులాడుతున్నాయనని సర్వేలు, అధ్యయనాలు కోడైకూస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆఖరికి ఎవరివైపు మొగ్గుతారోనని ప్రపంచం ఎదురుచూస్తోంది.

చరిత్రను తిరగరాస్తూ అమెరికన్లు తొలిసారి మహిళకు పట్టం కడతారా? లేకపోతే సంప్రదాయానికి అనుగుణంగా పురుషుడికే అధికారాన్ని అప్పగిస్తారా అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక ఎన్నికల ఫలితంలో కీలక పాత్ర పోషించే స్వింగ్ స్టేట్స్‌గా పేరుగాంచిన మిచిగాన్, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, న్యూమెక్సికో, వర్జీనియా, పెన్సిల్వేనియా, జార్జియా తదితర రాష్ట్రాలపై ట్రంప్, హారిస్ ప్రధానంగా దృ ష్టిసారించారు. ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకుసర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రజాస్వామ్యం, అమెరికా జాతీయత, ఆర్థిక పరిస్థితి, విదేశాంగ తదితర అంశాలను అస్త్రశస్త్రాలుగా చేసుకుని ప్రచారం సాగిస్తున్న హారిస్, ట్రంప్‌లలో ఎవరిని విశ్వసిస్తున్నామో అమెరికన్లు మరికొద్ది గంటల్లోనే తీర్పు చెప్పబోతున్నారు. మ్యాజిక్ ఫిగర్ 272 ఎలక్టోరల్ ఓట్లను ఎవరికి కట్టబెడతారో తేలిపోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News