Wednesday, January 22, 2025

అమెరికా ఉపాధ్యక్ష రేస్‌లో నిక్కీహాలేకు అంత సామర్థ్యం లేదు : ట్రంప్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో ముందున్న విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇండియన్ అమెరికన్ నిక్కీ హాలేపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవికి పోటీపడే సామర్థం ఆమెకు లేదని విమర్శించారు. ఉపాథ్యక్ష పదవికి ఆమె ఎంపిక కాదని పేర్కొన్నారు. శుక్రవారం కాంకార్డ్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

“కొన్ని విషయాలు మీరు చెప్పినప్పుడు … అవి పోటీ నుంచి బయటకు పంపిస్తాయి. అయితే అవేమిటో చెప్పలేను. కానీ ఆమె ఆ పదవికి సరైన అభ్యర్థికాదు. నేను అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయ్యానని చెప్పడానికి గర్వపడుతున్నాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. న్యూహాంప్‌షైర్ ఎన్నికల్లో ట్రంప్‌కు సమీప ప్రత్యర్థిగా నిక్కీ హాలే ఉన్నారు. 51 ఏళ్ల నిక్కీ హాలే కచ్చితంగా ఉపాధ్యక్ష పదవికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిగా శుక్రవారం కనిపించారు. గత కొన్ని నెలలుగా రిపబ్లికన్ రేస్‌లో ఆమె ఎన్నిక సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News