వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తి రుగులేని విజయకేతనం ఎగురేశారు. ప్రపంచవ్యాప్త ఆసక్తి దాయకమైన ఈ ఎ న్నికల్లో ఆయన పాపులర్ ఓట్లు, మరో వైపు అత్యంత కీలకమైన ఎలక్టోరల్ ఓ ట్ల సాధనలోనూ ఆధిక్యతను ప్రదర్శించారు. దీనితో ఇంతకు ముందు 45వ దే శాధ్యక్షుడు అయిన ట్రంప్ ఓ విరామం తరువాత ఇప్పుడు దేశ 47వ ప్రెసిడెం ట్ కావడానికి రంగం సిద్ధం అయింది. అమెరికా ఫస్ట్ నినాదం, అంతకు మిం చి ఇప్పటి అంతర్జాతీయ సంక్లిష్ట పరిస్థితులలో అమెరికా ప్రతిష్ట ఇనుమడింపచేయడం ట్రంప్‌తోనే సాధ్యం అనే కీలక విషయం ట్రంప్‌ను తిరిగి శ్వేతసౌధపు బాస్ చేయడానికి దోహదం చేసిందని భావిస్తున్నారు. అమెరికాను పెద్ద చెత్తబు ట్ట కానిచ్చేది లేదని, వలసలు ఇందులో అక్రమ వలసలకు కళ్లెం వేస్తామని ప్ర కటించడం కూడా విజయానికి కారణం అయింది. ప్రతిభకు పట్టం కట్టడం జ రుగుతుందనే వాదన, దేశాన్ని వామపక్ష తీవ్ర
భావజాలంలోకి, స్వేచ్ఛ పేరిట అరాచకానికి తీసుకువెళ్లే పరిస్థితినుంచి గల్టెక్కిస్తామనే ఆయన ప్రచార అస్త్రాలు ఫలించాయనే విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ట్రంప్ ఇప్పటి ఎన్నికలలో కీలకమైన స్వింగ్ రాష్ట్రాలలో కూడా తమ ప్రాబల్యం చాటుకన్నారు. తుది వార్తల దశలో ఆయన విస్కాన్సిన్ రాష్ట్రంలో కూడా గెలిచి 280 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లును పొందారు. ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ 224 ఓట్లకు పరిమితం అయ్యారు. దేశంలో నిబంధనల ప్రకారం అధికారం చేపట్టడానికి అవసరం అయిన సంఖ్యాబలం (మేజిక్ ఫిగర్ ) 270. ఈ సూచీని దాటి ఇప్పుడు ఆయన ముందుకు సాగారు. అదనంగా మరో 30 వరకూ ఎలక్టోరల్ ఓట్లు దక్కించుకునే సంకేతాలు కూడా వెలువడ్డాయి.
దీనితో ఇంతవరకూ ఎప్పుడూ లేని విధంగా ట్రంప్ తమ పదవిలో మరోసారి తిష్ట వేసుకన్నట్లు అయింది. మరో వైపు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ 224 ఎలక్టోరల్ ఓట్లతో ఎన్నికల్లో పరాజయం పొందినట్లు అయింది. దేశంలో అధికారం ఖరారుకు అవసరం అయిన బలం ఉండే జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలు ట్రంప్ ఖాతాలో చేరాయి. మరో మూడు స్వింగ్ రాష్ట్రాలలో ఆధిక్యత సాగుతోంది. కాన్సన్ , అయోవా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లమామా, టెక్సాస్ , అర్కాన్సిన్ , లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నిసీ , మిస్సోరి, మిసిసిపి , ఒహాయో, వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా, స్వరాష్ట్రం ఫ్లోరిడా, ఐడహో, వెస్కాన్సి సొంతం చేసుకున్నారు. ప్రచారం , తరువాతి దశలోనూ ఆధిక్యత కనబర్చిన కమలా హారిస్ కాలిఫోర్నియా, ఓరెగన్, వాషింగ్టన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినోయి, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికల్, డెలవేర్, మసాచుసెట్స్, కొలరాడో, రోడ్ ఐలాండ్, హవాయి, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబయాలో ప్రాబల్యం చాటారు.
ఇంతకు ముందటి ఎన్నికలకు భిన్నంగా ఈసారి పాపులర్ ఓటులో ఆయనకు 51 శాతం ఓట్లు దక్కాయి. హారిస్ ఈ విషయంలో 47 శాతం వద్దనే ఆగిపోవల్సి వచ్చింది. న్యూయార్క్, వాషింగ్టన్, న్యూజెర్సీ వంటి నగర ప్రాంతాల ప్రజలు ఎక్కువగా డెమోక్రాటిక్ అభ్యర్థికి పట్టం కట్టారు. కాగా గ్రామీణ ప్రాంత ఓటర్లు ట్రంప్ వైపు మొగ్గు చూపారు. ఫలితాలు దీనినే ప్రతిపలించాయి. అరబ్ ముస్లింలు ఈసారి ట్రంప్‌ను తమ పెద్దన్నగా భావించారు. అమెరికా బైడెన్ హయాంలో గుడ్డిగానే ఉక్రెయిన్‌కు మద్దతు పలికిందని, ఇందుకోసం కోట్లాది డాలర్లను ఉక్రెయిన్‌కు నిధులుగా అందించడం, చివరికి ఈ విషయాన్ని ప్రపంచస్థాయిలో రెండు వర్గాలుగా చిత్రీకించడం వంటివాటికి అమెరికా కేంద్ర బిందువు అయిందనే ప్రచారం డెమోక్రట్లకు ఎదురుదెబ్బ అయింది.
విరామం తరువాతి రెండో గెలుపు
ఓ వైపు నిండా క్రిమినల్ కేసులు, అరాచకవాది అనే పేరు దూకుడు స్వభావి అనే ప్రచారం జరిగినా ట్రంప్ తిరిగి అధికార పీఠానికి చేరుకున్నారు. నాలుగేళ్ల అనంతరం ఆయన తిరిగి శ్వేతసౌథం తిరిగి చేరుకోనున్నారు. అమెరికా చరిత్రలో ఈ విధంగా గ్యాప్ తరువాత ప్రెసిడెంట్ అయిన అధ్యక్షుల జాబితాలో ట్రంప్ రెండవ వ్యక్తిగా మారారు. ఇంతకు ముందు ఈ ఘనత 1892లో గ్రోవర్ క్లెవ్‌లాండ్‌కు దక్కింది.
అమెరికాకు అతి వృద్ధుడైన ప్రెసిడెంట్
ట్రంప్ వయస్సు 78. అమెరికా చరిత్రలో అతి పెద్ద వయస్సుడైన వ్యక్తి దేశాధ్యక్ష స్థానంలోకి వెళ్లడం ఇదే తొలిసారి. ఇది రికార్డు అయింది. కాగా రెండోసారి కూడా ప్రెసిడెంట్ కావడం మరీ కీలకం అయింది.
ఎన్నికల ఫలితం పాపులర్ ఓటు …మ్యాజిక్ ఫిగర్ 270
హారిస్ 224… ట్రంప్ 280 ప్లస్
ఇక సెనెట్‌లో , మేజిక్ ఫిగర్ 50
హారిస్ 42 ….ట్రంప్ 52
ఇక హౌస్‌లో మ్యాజిక్ ఫిగర్ 218
హారిస్ 177….. ట్రంప్ 197
…………..
ట్రంప్ గెలుపు ….ప్రపంచ ప్రకంపనలు
*స్టాక్ సూచీలు, క్రిప్టోకరెన్సీ చలామణిలో ఎదుగుదల
* రష్యా ఆనందం ..యూరప్‌లో అయోమయం
* చైనా , ఉక్రెయిన్, రష్యా , వెస్ట్ ఆసియాలో విశ్లేషణలు