Sunday, December 22, 2024

నెవాడాలో ట్రంప్ విజయం

- Advertisement -
- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం నెవాడాలో విజయం సాధించారు. 2004లో అధ్యక్షుడు జార్జి డబ్లు బుష్ విజయం తరువాత నెవాడా రాష్ట్రాన్ని, అక్కడి ఆరు ఎలక్టొరల్ వోట్లను ట్రంప్ రిపబ్లికన్ల పరం చేశారు. ట్రంప్, డెమోక్రాట్ కమలా హారిస్ ఈ ఏడాది అనేక సార్లు నెవాడా రాష్ట్రంలో పలు ప్రచార కార్యక్రమాలు సాగించారు. నెవాడా కౌంటీల్లో చాలా వరకు గ్రామీణ ప్రాంతాలే. అవి 2020లో ట్రంప్‌నకు అనుకూలంగా భారీగా వోటు వేశాయి. కానీ, ఆ ఏడాది డెమోక్రాట్ జో బైడెన్ అత్యంత జనభా గాల కౌంటీలు వాషో, క్లార్క్‌లను గెలుచుకున్నారు. క్లార్క్ కౌంటీలోనే లాస్ వెగాస్ కూడా ఉన్నది. రాష్ట్ర వాసులలో ముప్పావు వంతు ఆ కౌంటీలోనే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News