Monday, January 20, 2025

డొనాల్డ్ ట్రంప్ కు మరో విజయం

- Advertisement -
- Advertisement -

లాస్‌వెగాస్ : అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఎన్నికలో మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరో విజయం సాధించారు. నెవాడలో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ కాకస్ పోటీలో ఆయన పోటీలేకుండా విజయం సాధించారు. దీనితో పార్టీ తరఫున అభ్యర్థిగా ఎంపికలో ఆయన స్థానం దాదాపుగా పదిలం అయింది. నెవాడా పోటీలో ట్రంప్‌పై పోటీకి ఏ ఇతర అభ్యర్థి ముందుకు రాలేదు. ఇక్కడి పోటీ నుంచి మాజీ రాయబారి నిక్కి హేలీ విరమించుకున్నారు.

ట్రంప్ పార్టీలో ఏదో విధంగా తన ఆధిక్యతను చాటుకోవడానికి యత్నిస్తున్నాడని ఆరోపిస్తూ హేలీ తన నిరసన ఓటు వాడుకున్నారు. తాను బరిలోకి దిగడం లేదని ప్రకటించారు. ఇక్కడ పోటీ లేకుండా గెలవడంతో ట్రంప్ ఇప్పుడు అన్ని 26 రాష్ట్రాల డేలిగేట్స్ మద్దతు తెచ్చుకున్నారు. మొత్తం మీద ఆయనకు మార్చిలో జరిగే తుది పోటీలో 1215 డెలిగేట్స్ బలం ప్రకటితం అయితే పార్టీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News