Thursday, January 23, 2025

ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా మళ్లీ యాక్టివ్ అయింది. ఆయన ఖాతాను పునరుద్ధరించినట్లు ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్ ఆదివారం ప్రకటించారు. అయితే ట్రంప్ మాత్రం దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలా, వద్దా అన్న విషయంపై మస్క్ ఓ పోల్ కూడా నిర్వహించారు. దానికి 15 లక్షలకుపైగా స్పందించారు. వారిలో 51.8 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. ఆ తర్వాత ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ లాటిన్ భాషలో ‘వాక్స్ పాపులి, వాక్స్ డీ’ అని జత చేశారు. దానర్థం ‘ప్రజా వాక్కే దైవ వాక్కు’(The voice of the people is the voice of God).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News