Wednesday, January 22, 2025

రక్తదానం చేయండి.. మరొకరికి ప్రాణం పోయండి

- Advertisement -
- Advertisement -
  • హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

సుబేదారి: రక్తదానం చేసి మరొకరికి ప్రాణం పోయవచ్చని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అవసరం, వారి కోసం మన చిన్న ప్రయత్నమే రక్తదాన శిబిరం, ఇది మన కర్తవ్యంగా భావించి అందరూ ముందుకు రావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ హన్మకొండ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ సౌజన్యంతో ఐడీఓసీ కాంప్లెక్స్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటుచేయగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తోపాటు అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ, డీఆర్‌డీఓ ఆకవరం శ్రీనివాస్‌కుమార్, జిల్లా అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని 155 యూనిట్ల రక్తదానం చేశారు. డీఆర్‌డీఓ ఆకవరం శ్రీనివాస్‌కుమార్ 54వ సారి రక్తదానం చేశారు.

ఈ రక్తదాన శిబిరంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ నిర్వాహకుడు విజయ్‌చందర్‌రెడ్డి, ఈవీ శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, టీఎన్జీవోస్ ప్రెసిడెంట్ జగన్మోహన్‌రెడ్డి, పుల్లూరు వేణుగోపాల్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News