Thursday, January 23, 2025

పేదలకు నామా చేయూత

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : అభివృద్ధికి చిరునామా ఎంపి నామా నాగేశ్వరరావు అని పలువురు ముఖ్య వక్తలు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఎంపి నామా నాగేశ్వరరావు చొరవతో డోర్నకల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఇల్లందు, ఖమ్మం, మధిర, పాలేరు, సత్తుపల్లి,వైరా నియోజక వర్గాలకు చెందిన 41 మందికి మంజూరైన రూ.16,02,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంగళవారం ఖమ్మంలోని ఎంపీ నామా క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన వక్తల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎంపి నామా నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకొని, బడుగు, బలహీన వర్గాల వారికి ఆర్థిక చేయూత అందిస్తున్నారని అన్నారు. నామా ప్రత్యేక కృషి వల్ల ప్రతి నెలా భారీ ఎత్తున సిఎం ఆర్‌ఎఫ్ చెక్కులను మంజూరు చేయిస్తూ పేదలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా ఎవరు అనారోగ్యంతో ఆపదలో ఉన్నా నేనున్నానంటూ ముందుకు వచ్చి, పేదలను ఆదుకుంటూ బాసటగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ క్యాంప్ కార్యాలయం ఇంచార్జి కనకమేడల సత్యనారాయణ, జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు, పార్టీ నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, దిశ కమిటీ సభ్యురాలు చింతల చెర్వు లక్ష్మీ, సొసైటీ డైరెక్టర్ చావా వేణు, కూసుమంచి శివాలయం మాజీ ఛైర్మన్ వీరవెల్లి వెంకటేశ్వర్లు, కూసుమంచి మహిళా నాయ కురాలు తిప్పని అలివేలమ్మ, కొక్కిరేణి ఎంపీటీసీ అంబేద్కర్, నాయకులు తన్నీరు రవి కుమార్, వాకదాని కోటేశ్వర రావు, గొడ్డేటి మాధవరావు, పార్టీ సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జి తాళ్లూరి హరీష్, నామా సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News