Monday, December 23, 2024

‘బై గాన్‌ ఫ్యాషన్‌’ ఇనార్బిల్‌ మాల్‌లో డొనేషన్‌ డ్రైవ్‌

- Advertisement -
- Advertisement -

Donation Drive in 'Bygone fashion' Inorbit Mall

హైదరాబాద్‌: మనం చేసే చిరు సాయం కూడా ఇతరుల ముఖాలపై చిరునవ్వులు పూయించవచ్చు. తాము చేస్తోన్న చిరు సాయంలో మీరూ భాగమవ్వమంటూ ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ ప్రత్యేకంగా ‘బై గాన్‌ ఫ్యాషన్‌’ శీర్షిక న ఓ వినూత్న ప్రచారం ప్రారంభించింది. దీనిలో భాగంగా నగరవాసులు తాము వాడిన లేదంటే తమకు అవసరం లేదనుకున్న వస్త్రాలను విరాళంగా అందించవచ్చు. ఈ వస్త్రాలను తమ ఎన్‌జీఓవో భాగస్వామి నిర్మాణ్‌కు ఇనార్బిట్‌ మాల్‌ అందించనుంది. తద్వారా మీరు అందించే చిరు సాయంతో ఇతరులకు పండుగ సంతోషాన్నీ తీసుకురానుంది.

దీనికోసం మాదాపూర్‌లోని ఇనార్బిట్‌ మాల్‌లో ప్రత్యేకంగా ఓ డొనేషన్‌ బాక్స్‌ ఏర్పాటుచేసింది. ఈ డొనేషన్‌ బాక్స్‌లో వస్త్రాలను వేసిన నగరవాసులు మనసునిండా సంతోషాన్ని మాత్రమే కాదు, జేబు నిండా కూడా సంతోషం నింపుకోవచ్చు. ఈ డొనేషన్‌ బాక్స్‌లో వస్త్రాలు వేసిన వారికి గిఫ్ట్‌ ఓచర్లను అందిస్తున్నారు. షరతులకు లోబడి వాటిని మాల్‌లో ఆటమ్‌ కలెక్షన్‌ కొనుగోలుపై మార్చుకోవచ్చు. ఇంకేందుకు ఆలస్యం… మీలోని దాన కర్ణుడిని నిద్ర లేపండి. ఇవ్వడంలోని ఆనందాన్ని పొందండి… ఇతరులకు స్ఫూర్తిగా నిలవండి.. సంతోషాన్నీ పంచండి!!.

Donation Drive in ‘Bygone fashion’ Inorbit Mall

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News