Saturday, September 21, 2024

ఉస్మానియా ఆసుపత్రికి రూ.78 లక్షల వైద్య పరికరాల విరాళం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌టిపిసి) అధికారుల బృందం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కార్యక్రమంలో భా గం గా ఉస్మానియా ఆసుపత్రికి రూ. 78 లక్షల విలువ చేసే వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు గురువారం ఎన్‌టీపీసీ అధికా రులు ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్‌ను కలిశారు. ఈ సందర్బంగా వారు యూరాలజీ విభాగా నికి చెందిన అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చేందుకు ఆసుపత్రి వైద్యా ధికారులతో ఒప్పందం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ బి. నా గేందర్ మాట్లాడుతూ పేద రోగులకు మె రుగైన వైద్యం కోసం విరాళాల రూపంలో అత్యాధునిక వైద్య పరికాలను అందించేందుకు ముందుకు రావడం పట్ల సం తోషం వ్యక్తం చేశారు. ఎన్‌టిపిసి ఉన్నతాధికారులు విరాళంగా ఇచ్చిన వైద్య పరికరాలతో యూరాలజీ విభాగంలో చికిత్సలతోపాటు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలకు వినియోగిస్తామన్నారు. పేద రోగుల సహాయార్థం వైద్య పరికరాలను విరాళంగా అందజేసిన ఎన్‌టిపిసి అధికారులకు కృతజతలు తెలిపారు. కొత్త పరికరాలు అందజేయడం ద్వారా రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించగలుతామన్నారు. ఈ మధ్యకాలంలో పలు సేవా సంస్థలకు ఇందుకు ముందుకు రావడం ఎంతో సంతోషదాయకమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News