Wednesday, January 22, 2025

నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు

- Advertisement -
- Advertisement -

తిరుమలలో నిర్మించిన నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటల నుండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, గోమాత ప్రవేశం, గోపూజ, సుదర్శన హోమం నిర్వహిస్తారు. అనంతరం కానుకలను వేరుచేయడం, లెక్కించడం చేపడతారు. తిరుమ‌లలో స్వామివారి హుండీ కానుక‌లు లెక్కించ‌డానికి బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాత‌న సౌక‌ర్యాల‌తో కూడిన నూత‌న పరకామణి భవనం నిర్మించారు. శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల సందర్భంగా 2022 సెప్టెంబరు 28న రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అభివృద్ధి పనులు పూర్తి చేసి సిద్ధం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News