Monday, December 23, 2024

బిఆర్ఎస్ కు విరాళాల వెల్లువ: దన్యవాదాలు తెలిపిన మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

Donations to BRS Party in Balkonda

నిజామాబాద్/బాల్కొండ: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా నిలిచేందుకు బాల్కొండకు చెందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న పలువురు లబ్దిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 93 వేల 600 రూపాయలు విరాళంగా స్థానిక టిఆర్ఎస్(బిఆర్ఎస్) నాయకులకు అందించారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ లాంటి సంక్షేమ పథకాలు అందాలంటే కేసిఆర్ నాయకత్వం అవసరమని వారు పేర్కొన్నారు. భారత్ రాష్ట్ర సమితితో దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు తమ వంతు సహకారంగా విరాళం ఇచ్చినట్లు లబ్దిదారులు తెలిపారు. పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు, బీడీ కార్మికులు, రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్‌ లబ్ధిదారులు ఈ విరాళం ఇచ్చిన వారిలో ఉన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసిఆర్ కు మద్దతుగా నిలబడిన లబ్ధిదారులకు ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Donations to BRS Party in Balkonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News