Friday, December 20, 2024

ఎన్టీ ఆర్, కృష్ణతో ఎక్కువ సినిమాలు చేశాను: జయమాలిని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒకప్పుడు తన ఐటమ్ సాంగ్స్‌తో తెలుగు సినిమాకే ఓ గ్లామర్ తెచ్చిన నటి జయమాలిని. ఆమె ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో నాటి హీరోలందరితో కలిసి నటించినట్లు చెప్పారు. ఎన్.టి.రామారావు, కృష్ణతో ఎక్కువ సినిమాలు చేశానని చెప్పారు. నాగేశ్వర రావు సెట్లో ఎక్కువ సందడి చేసేవారన్నారు. తనకు ఎన్టీఆర్ అంటే భయం, భక్తి ఉండేవని తెలిపారు. ఏఎన్‌ఆర్ అంటే భయం ఉండేది కాదని, కాకపోతే ఆయనపట్ల భక్తి భావన ఉండేదన్నారు. పెళ్ళయాక ఎవరి బలవంతం లేకపోయినప్పటికీ తనకు తానై నటించడం మానేశానని వివరించారు. నాటి హిరోయిన్స్ చైన్నైలో తన ఇంటికి ఇప్పటికీ వస్తూపోతున్నారని, అలాగే తాను వారిళ్లకు వెళ్లి వస్తుంటానని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు జ్యోతి లక్ష్మి, విజయలలిత, అనూరాధ, సిల్క్ స్మిత తదితరులు సినిమాలో తమ డ్యాన్సులతో కిర్రెక్కించేవారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News