Sunday, December 22, 2024

చైనా రక్షణ మంత్రిగా డాంగ్..

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనాలో నూతన రక్షణ మంత్రిగా జనరల్ డాంగ్ జన్ నియమితులు అయ్యారు. ఈ మేరకు చైనా అత్యున్నత స్థాయి చట్టసభ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పిసి) విషయాన్ని నిర్థారించింది. డాంగ్ ప్రస్తుతం దేశ నౌకాదళ ప్రధానాధికారిగా బాధ్యతలలో ఉన్నారు. రెండు నెలల క్రితం దేశ రక్షణ మంత్రి జనరల్ లి షాంగ్ఫూను ఎటువంటి కారణాలు లేకుండానే పదవి నుంచి బర్తరఫ్ చేశారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ స్థానాన్ని ఇప్పుడు నౌకాదళాధికారి డాంగ్‌తో భర్తీ చేశారు.

నౌకాదళంలోని పలు విభాగాలలో డాంగ్ కీలక స్థానాలలో పనిచేసిన అనుభవం ఉంది, ఆయన వయస్సు ఇతర వివరాలను అధికారికంగా వెల్లడించలేదు . చైనాలో సైనిక దళాల సంబంధిత సెంట్రల్ మిలిటరీ కమిషన్ సారధ్య బాధ్యతలలో ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ ఉన్నారు. రక్షణ మంత్రి పదవికి డాంగ్ పేరును దేశాధినేత క్లియర్ చేశారని అధికార వర్గాలు ధృవీకరించాయి. చైనాలో సైనిక, అధికార యంత్రాంగ నిర్వహణ బాధ్యతల పగ్గాలన్ని కూడా జిన్‌పింగ్ వద్దనే కేంద్రీకృతం అయి ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News