Thursday, December 19, 2024

గాడిద పాపాలు

- Advertisement -
- Advertisement -

గాడిద పాల పేరిట భారీ మోసానికి పాల్పడిన చెన్నై సంస్థ

గాడిదలను తామే సరఫరా చేస్తామంటూ ఒక్కొక్కదానికి
రూ.1.50లక్షల వరకు వసూలు ఫామ్‌లోకి తీసుకురాగానే పలు
గాడిదల మృతి 18నెలలుగా పాల సేకరణ డబ్బులివ్వని
నిర్వాహకులు వందల కోట్లు నష్టపోయామంటున్న బాధితులు

మన తెలంగాణ/పంజాగుట్ట: గాడిద పాల విక్రయాల ద్వారా లక్షలాది రూపాయల లాభాలు వ స్తాయని నమ్మించి మోసం చేశారని బాధితులు వా పోయారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితు లు బెంగళూరుకు చెందిన సాయిబాబా, అనంతపూర్‌కు చెందిన తేజస్విని, మాచర్లకు చెందిన ర మాదేవి తదితరులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. గాడిద పాల విక్రయాల ద్వారా లక్షలాది రూపాయల లాభాలు వస్తాయంటూ పలు యూట్యూబ్లో పలు చానెళ్లు ప్రసారం చేసిన కథనాలు చూసి ఈ వ్యాపారంపై ఆసక్తి పెంచుకున్నామని తెలిపారు. అందులో పేర్కొన్న తమిళనాడు తిరునల్వేలికి చెందిన డాంకీ ప్యాలెస్ అనే సంస్థకు సంబంధించిన సంబరుకు ఫోన్ చేయగా, గిరి సురేందర్ అనే వ్యక్తి అందుబాటులోకి వచ్చారని. ఒక లీటరు పాలకు రూ.1,600 నుంచి 1,800 వరకు చెల్లిస్తామని, గాడిదలను కూడా తామే సరఫరా చేస్తామని చెప్పారన్నారు. అందుకు ఒక్కొక్క గాడిదకు రూ.1.50లక్షలు

వసూలు చేయడమే కాకుండా, సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కొక్కరి వద్ద రూ.5.50లక్షల చొప్పున తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన రైతులు, ఔత్సాహికుల నుంచి వసూలు చేశారన్నారు. అతని మాటలను నమ్మి లక్షలు ఖర్చు చేసి ఫామ్లను సైతం నిర్మించుకున్నామని, కొన్ని గాడిదలు ఆన్‌లోడ్ అయ్యి సామ్లోకి పంపించిన 24 గంటల లోపే చనిపోయేవని తెలిపారు. గాడిదల నుంచి సేకరించిన పాలు లీటరు రూ.1600 చొప్పున కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకున్నారని, 3 నెలల పాటు నమ్మకం కలిగించేలా నగదు చెల్లించారని బాధితులు తెలిపారు.

అయితే గత 18 నెలలుగా డాంకీ ప్యాలెస్‌కు సరఫరా చేసిన పాల డబ్బులు, నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం లేదని వాపోయారు. గట్టిగా నిలదీస్తే చెక్కులను అందజేశారని, అవి కాస్తా బౌన్స్ ఆయ్యాయని వాపోయారు. తమను మోసం చేసిన వారిలో డాంకీ ప్యాలెస్ ప్రధాన నిర్వాహకుడు బాబు ఉల్గనాధం ఒకరని, అతని భాగస్వాములు గిరి సుందర్, సోనికా రెడ్డి, బాలజీ, శబరినాథ్, డాక్టర్ రమేశ్ కుమార్లు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సుమారు 400 మందిని మోసగించారని, వంద కోట్లకు పైగా నష్టం చేశారని వాపోయారు. ఇప్పటికే తిరునల్వేలిలోని కలెక్టర్, ఈడీ ఎస్పీ, హైదరాబాద్‌లోని సీసీఎస్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఏపి మంత్రి నారా లోకేష్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా వివరాలు పంపితే ఆయన సానుకూలంగా స్పందించి తమకు అండగా నిలబడుతామన్నారని తెలిపారు. తెలంగాణ, ఏపి, తమిళనాడు ముఖ్యమంత్రులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News