Thursday, January 23, 2025

గాడిదలు కావలెను!

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ లోని జోధ్ పూర్ మున్సిపల్ అధికారులు ‘గాడిదలు కావలెను’ అంటూ ప్రకటన ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అధికారులకు గాడదలు ఎందుకని అనుకుంటున్నారా? అయితే ఈ వార్తను మీరు పూర్తిగా చదవాల్సిందే.

దేశవ్యాప్తంగా ఒకప్పుడు రిక్షాలు లేదా ఎడ్ల బండ్లలో చెత్త సేకరణ జరిగేది. కానీ మారిన పరిస్థితుల్లో ఇప్పుడు వ్యాన్లలో జరుగుతోంది. అయితే జోధ్ పూర్ లోని కొన్ని ప్రాంతాలు చాలా ఇరుకుగా, ఎగుడుదిగుడుగా ఉండి, వ్యాన్లు వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉంటుంది. ఈ ప్రాంతాల్లో చెత్త సేకరణ అధికారులకు కత్తిమీద సాముగా మారింది. దీంతో ఇలాంటి ప్రాంతాల్లో చెత్త సేకరణకు గాడిదలే బెటరని భావించారు. కొంతకాలంగా గాడిదల ద్వారానే చెత్తను తరలిస్తున్నారు కూడా.  అందులో భాగంగానే ‘చెత్త సేకరణకు గాడిదలు కావాలి’ అంటూ జోధ్ పూర్త మున్సిపాలిటి ఇటీవల టెండర్లను ఆహ్వానించింది. గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ అధికారులు ఏటా గాడిదల కోసం రూ. 60 లక్షల విలువైన టెండర్ వేస్తున్నారు. ప్రస్తుతం రూ. 65 లక్షల టెండర్ కింద 65 గాడిదలను పనిలోకి దించారు. అంటే ఒక్కొక్క గాడిదపైనా లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నమాట. బ్రహ్మపురి, ఖగల్ వంటి ప్రాంతాల్లో గాడిదలపైనే చెత్తను తరలిస్తున్నారు.  దీనికి తోడు నగరంలో గాడిదల సంఖ్య పెంచాలని నిర్ణయించిన అధికారులు వాటి పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News