కుంటాల : గజ్జలమ్మ ఆలయ అభివృద్ధ్దికి దాతల సహకారం అభినందనీయమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. జుట్టు నారాయణ, నరేందర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు భక్తుల సౌకర్యార్థం నిర్మించిన రెండు వసతి గదులను ఆదివారం ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్జలమ్మ ఆలయాభివృద్ధ్దికి తనవంతుగా నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ఆలయ నిర్మాణంతో పాటు ప్రహరీ గోడ రాజగోపురం నిర్మాణం కోసం ఆడిటోరియం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం దేవాలయాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక దేవాలయాలకు అభివృద్ధ్ది చేశారని అన్నారు. దాతల సహకారంతో గజ్జలమ్మ ఆలయం అడెల్లి తరహాలో అభివృద్ధ్ది చెందుతుందని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
అనంతరం వసతి గదులను నిర్మించిన మున్సిపల్ ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ జుట్టు శైలజ, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షులు జుట్టు గజేంధర్ దంపతులను అభినందించి శాలువాతో సత్కరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అప్క గజ్జారాం, జడ్పీటీసీ గంగామణి బుచ్చన్న, అధ్యక్షుడు ముజిగే ప్రవీణ్, మాజీ జడ్పి చైర్మెన్ జుట్టు అశోక్, రూరల్ సీఐ నైలు, మార్క్‌పెడ్ డైరెక్టర్ గంగాచరణ్, బిఆర్‌ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ పెంట ధశరథ్, వైస్ ఎంపిపి మౌనిక నవీన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.