Monday, December 23, 2024

గ్రామాభివృద్ధిలో దాతలు భాగస్వాములవ్వాలి

- Advertisement -
- Advertisement -
  • కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి

ఘట్‌కేసర్: గ్రామాభివృద్దిలో దాతలు భాగస్వాములు కావాలని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ మండలం ఘణపూర్ గ్రామ పరిధి లింగాపూర్‌లో స్థానిక సర్పంచ్ బద్దం గోపాల్‌రెడ్డి తండ్రి బద్దం యాదిరెడ్డి అందించిన 4లక్షల విరాళంలో నిర్మించిన సిసి రోడ్డును ఆదివారం ముఖ్య అతిధిగా పాల్గొని సర్పంచ్ గోపాల్‌రెడ్డితో కలసి ప్రారంభించా రు.

ఈ సందర్భంగా యాదగిరి రెడ్డిని శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో స్థిరపడిన వారు, ఇతర ప్రాం తంలో స్థిర పడిన పెద్దలు గ్రామాభివృద్ద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, ఉపసర్పంచ్ పరమేష్ గౌడ్, మాజీ సర్పంచ్‌లు నానావత్ రూప్ సింగ్ నాయక్, వేముల మమత, గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల రాజు, మహిళా నాయకురాలు పాలడుగు పద్మా,బర్ల అనిత, ఫైళ్ళ లతారెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నాగులపల్లి శ్రీనివాస్, నాయకులు వేముల గోవర్ధన్ గౌడ్, వేముల శంకర్ గౌడ్, సత్తయ్య గౌడ్, లక్ష్మయ్య గౌడ్, వరికుప్పల వెంకటేష్, గుర్జకుంట నర్సింహా, శ్రీనివాస్, రమేష్, నానావత్ శివాజీ నాయక్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News