Sunday, December 22, 2024

గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి

- Advertisement -
- Advertisement -
  • మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి

షాబాద్ : గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని హైతబాద్ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలో మండలంలోని 10 ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఫలితాలను పొందిన 11 మంది విద్యార్థులకు రూ 4వేల చొప్పున నగదుతో పాటు బహుమతులను స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డితో కలిసి దాత మాధవి సహకారంతో పీఆర్‌టీయూ షాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులను దాతలు ప్రోత్సహిస్తే వారు మరింతా ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఆనంతరం విద్యార్థులు నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ రాథోడ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోవర్ధన్, మహేందర్‌రెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్, కృష్ణ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News