Monday, December 23, 2024

అధైర్య పడొద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది

- Advertisement -
- Advertisement -

మంథని టౌన్: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మానేరు నది ఉప్పొంగి వరద ముంపుకు గురైన మండలంలోని సోమన్‌పల్లి, నాగేపల్లి, చిన్నోదాల గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. వరదలో మునిగిపోయిన పంట పొలాలను, గృహాలను యన పరిశీలించారు.

ఈ సందర్భంగా జ్పడీ చైర్మన్ మాట్లాడుతూ ఎన్నడూ ఊహించని రీతిలో ఈసారి భారీ వర్షాలు కురిశాయని, కరీంనగర్, వరంగల్ లాంటి పట్టణాలకు వరద నీరు ముంచెత్తిందని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు ఉప్పొంగి ప్రవహించడంతోనే ఈ ప్రాంతానికి వరద తాకిడికి గురై కొంత నష్టం జరిగిందని ఆయన వివరించారు. పంట పొలాలను వరదలు ముంచెత్తి ఇసుక మేటలు వేశాయో ఆ ప్రాంతాలను సర్వే చేయించాలని జిల్లా కలెక్టర్‌ను కోరనున్నట్లు ఆయన తెలిపారు. రైతులు, బాధితులు అధైర్యపడవద్దని ఆయన ధైర్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News