Monday, December 23, 2024

అధైర్య పడొద్దు.. మేమంతా అండగా ఉంటాం

- Advertisement -
- Advertisement -
  •  భారతి కుటుంబానికి కురుమ సంఘం తరఫున ఆర్థిక సహాయం
  • పిల్లలకు ఉచిత వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన డాక్టర్ నాగారం లావణ్య
  • భారతికి భరోసా కల్పించిన కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్

తాండూరు రూరల్: కురుమలు అధైర్య పడద్దని.. కుల బాంధవులను కడుపున పెట్టుకుని కాపాడుకుంటామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్ అన్నారు. తాండూరు మండల పరిధిలోని ఓగీపూర్ గ్రామానికి చెందిన కురువ భారతిని బషీరాబాద్ మండలంలోని నవంద్గీ గ్రామానికి చెందిన పాండుకు ఇచ్చి వివాహం చేశారు.

గత కొంతకాలంగా భర్త పాండు లేకపోవడంతో తన ఇద్దరు పిల్లలు అర్చన, మల్లేశ్‌తో కలిసి తల్లిగారి ఊరైనా ఓగీపూర్ గ్రామంలో నివాసం ఉంటూ కాలం వెళ్ళదీస్తుంది. అయితే ఆమె ఇద్దరు పిల్లల్లో కూడా ఎదుగుదల లోపించి.. అంగవైకల్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్ పొందేందుకు సదరం సర్టిఫికెట్ కోసం అవస్థలు పడుతుంది. విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్ భారతికి భరోసా నింపి, ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

ఈ మేరకు గురువారం తాండూరు కురుమ సంఘం డివిజన్ అధ్యక్షుడు నాగారం జగదీశ్‌తో కలిసి ఓగీపూర్ గ్రామానికి వెళ్లారు. కురుమ కుల బాంధవులతో కలిసి భారతి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కురుమ కులాస్తులు ఎవరు కూడా ధైర్యపడవద్దని.. సంఘం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతో కురువ భారతి పిల్లలకు సదరం సర్టిఫికెట్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భారతి కుటుంబానికి సంఘ నాయకులమంతా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

అనంతరం అనారోగ్యం బారిన పడిన ఇద్దరు పిల్లలను ప్రముఖ వైద్యురాలు డాక్టర్ నాగారం లావణ్య పరీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతి ఇద్దరు పిల్లలు మల్లేశ్, అర్చనలకు ఉచితంగా వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రతినెల ఉచిత చికిత్సతో పాటు మందులు అందజేస్తానని తెలిపారు. ప్రతి నెల పిల్లలను తీసుకువచ్చి వైద్యం చేయించుకొని తీసుకెళ్లాలని సూచించారు. తమకు సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చిన కురుమ సంఘం నాయకులకు భారతి తన పిల్లలతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పూజారి పాండు కురుమ, ఇందూరు మల్లేశం కురుమ, పల్లె వెంకటయ్య కురుమ, కౌన్సిలర్ బాలప్ప కురుమ, వీరేశం కురుమ, గొల్ల బీరప్ప, పూజారి నర్సింహులు, అగ్గనూరు గుండప్ప, కరన్కోట్ దస్తప్ప, కొత్తూరు బాలప్ప తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News