Tuesday, January 21, 2025

సైబర్ నేరాలకు మోసపోవద్దు

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డి : మోసగాళ్లు వివిధ రకాలుగా సైబర్ నేరాలకు గురి చేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉచితంగా వచ్చే డబ్బులకు ఆశపడి ఖాతాల్లో ఉన్న డబ్బులను కాస్తా మోసగాళ్ల పాలు చేయొద్దని ఏఎస్సై నర్సింగ్‌రావు హితవు పలికారు. గురువారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ప్రజలకు ఆయన సైబర్ నేరాలపై, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా మోసం చేయడంలో సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారని అన్నారు.

అందువల్ల ఉచితంగా వచ్చే వాటికి ఆశపడొద్దన్నారు. సైబర్ మోసానికి గురైన వాళ్లు వెంటనే సమీపంలోని పోలీస్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. అంతు కాకుండా అతి వేగంగా ప్రయాణాలు చేసి ప్ర మాదాల్లో ప్రాణాలు కోల్పోవద్దన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మిట్ ధరించాలని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని తెలిపారు. ఏఎస్సై విజయ, కానిస్టేబుల్లు శ్రీకాంత్, సాయిలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News